News November 12, 2024

BIG NEWS: యురేనియం తవ్వకాల నిలిపివేతకు ఆదేశాలు

image

కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఇప్పటికే తవ్వకాలు నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా స్పష్టం చేశారు.

Similar News

News November 14, 2024

పోసానిపై చర్యలు తీసుకోండి.. బనగానపల్లిలో ఫిర్యాదు

image

నటుడు పోసాని కృష్ణ మురళిపై చర్యలు తీసుకోవాలని బనగానపల్లి జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. TTD ఛైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని సీఐ ప్రవీణ్ కుమార్‌కు వారు వినతిపత్రం అందజేశారు. ఆ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తెలిపారు. వెంకటసుబ్బయ్య, గుర్రప్ప, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, జవహర్, వెంకట రాముడు, శేఖర్, ఓబులేసు, నాగేశ్, సుధాకర్ పాల్గొన్నారు.

News November 14, 2024

వెలుగోడులో యువతి ఆత్మహత్య

image

నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణం ఎస్సీ కాలానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై విష్ణు నారాయణ వివరాల మేరకు.. తల్లిదండ్రులు బయటకి వెళ్లిన సమయంలో 19 ఏళ్ల యువతి ఇంట్లో ఉరేసుకుంది. బంధువుల ఇంటికెళ్లి తిరిగొచ్చిన తల్లిదండ్రులు కూతురి బలవన్మరణాన్ని గమనించి బోరున విలపించారు. అయితే ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News November 14, 2024

KNL: బాలికపై అత్యాచారయత్నం.. వైసీపీ సర్పంచ్ అరెస్ట్!

image

కర్నూలు జిల్లా కోసగి మండలంలో 13ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ వైసీపీ నేత, సర్పంచ్ హుసేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు కార్యకర్తలు వినోద్, సూరిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై చంద్రమోహన్ చెప్పారు. వారిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వివరించారు. అత్యాచారయత్నం అనంతరం పరారీలో ఉన్న నిందితులను కోసిగి గ్రామ శివారులో అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.