News November 12, 2024

డిసెంబర్ 1 నుంచి బీజేపీ పాదయాత్ర

image

TG: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చే నెల 1 నుంచి బీజేపీ నేతలు పాదయాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిరసన తెలుపుతూ పాదయాత్రను చేయాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ సవాలును స్వీకరిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 15 లేదా 16న మూసీ పరీవాహక ప్రాంతాల్లో బస చేయనున్నారు.

Similar News

News January 3, 2026

కీలక అంశంపై చర్చ.. ఎవరికి వారే యమునా తీరే!

image

TG: నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయంపై అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వం కీలక చర్చ పెట్టింది. కానీ దీనికి ఒకరోజు ముందే BRS సమావేశాలను బహిష్కరించింది. ఇవాళ మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే అధికార కాంగ్రెస్ MLAలే సభలో కూర్చోకుండా లాబీల్లో చక్కర్లు కొట్టారు. దీనిపై స్వయంగా CM రేవంత్ సీరియస్ అయ్యారు. అటు చర్చ సందర్భంగా పలువురు BJP ఎమ్మెల్యేలు సభలో నిద్రపోయారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

News January 3, 2026

గొర్రెల పెంపకం – విస్తృత పద్ధతి అంటే ఏమిటి?

image

గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, గొర్రెల కాపరులు ఆచరించే పద్ధతి ఇది. గొర్రెలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పంట పొలాల్లో, బంజరు భూమి, అటవీ ప్రాంతాల్లో, పచ్చిక బయళ్లలో మేసి రాత్రి ఇంటికి వస్తాయి లేదా పంట పొలాల్లోనే ఎరువు కొరకు మంద కడతారు. గొర్రెలకు ప్రత్యేకంగా పాక ఉండదు. ఈ పద్ధతిలో ఖర్చు తక్కువ, గాలి వెలుతురు పుష్కలంగా లభిస్తాయి. కానీ ఎండకు, వానకు, చలి నుంచి జీవాలకు రక్షణ, అన్ని కాలాల్లో గడ్డి దొరకదు.

News January 3, 2026

ఉద్యోగ వేటలో మహిళల పోటాపోటీ

image

ఉద్యోగాలకు పోటీ పడడంలో మహిళల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ‘అప్నా డాట్ కో’ ప్రకారం 2025లో దేశంలో 14L ఉద్యోగాలకు 9 కోట్ల మంది దరఖాస్తు చేశారు. వారిలో 3.8 కోట్ల మంది(40%) మహిళలే ఉన్నారు. 2024తో పోలిస్తే వీరి సంఖ్య 36% పెరిగింది. ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ రంగాల్లో మేనేజర్, లీడర్‌షిప్ రోల్ పోస్టులకు ఎక్కువగా పోటీపడుతున్నారు. మొత్తం పోస్టుల్లో 10L చిన్న, మధ్య తరహా, 4L పెద్ద కంపెనీలవి ఉన్నాయి.