News November 12, 2024
APలో 6 ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీపై సర్వే

APలో 6 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయనుంది. కుప్పంలో 1501 ఎకరాలు, నాగార్జునసాగర్‌లో 1670, తాడేపల్లి గూడెం-1123, శ్రీకాకుళం-1383 ఎకరాలు, తుని-అన్నవరంలో 787 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రూ.2.27 కోట్లు విడుదల చేయనుంది.
Similar News
News December 28, 2025
సిల్వర్ షాక్.. నెలలో ₹82,000 జంప్

సరిగ్గా నెల క్రితం KG వెండి ధర ₹1,92,000. ఇప్పుడది ₹2,74,000కు చేరింది. కేవలం నెలరోజుల్లోనే ₹82,000 పెరిగింది. ‘పేదవాడి బంగారం’గా పిలిచే వెండి ఇప్పుడు తానూ బంగారం బాటలోనే నడుస్తానంటోంది.. దీంతో కొనలేక సామాన్యులు.. అమ్మకాలు లేక వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ రానుండటంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులు కావడం పక్కాగా కనిపిస్తోంది!
News December 28, 2025
DRDOలో JRF పోస్టులు

DRDO పరిధిలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీ(<
News December 28, 2025
‘అర్బన్ నక్సల్స్’పై NIA ఫోకస్.. రాబోయే రోజుల్లో అరెస్టులు!

యువతలో మావోయిస్టు భావజాలాన్ని నూరిపోస్తున్న ఫ్రంటల్ ఆర్గనైజేషన్లపై NIA ఫోకస్ పెట్టింది. అడవుల్లో మావోయిస్టులను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్నా కొందరు మేధావుల ముసుగులో యువతను రెచ్చగొడుతున్నారని సీరియస్‌గా ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మావోలను హీరోలుగా వర్ణిస్తూ అమాయకులను అడవిబాట పట్టిస్తున్నట్లు గుర్తించింది. రాబోయే రోజుల్లో అలాంటి వారిని అరెస్టు చేయడానికి ప్లాన్లు వేస్తోంది.


