News November 12, 2024
‘విప్’లుగా గణబాబు, వేపాడ చిరంజీవి

శాసనసభ విప్‌గా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబును ప్రభుత్వం నియమించింది. శాసన మండలిలో విప్‌గా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గణబాబు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. 2017 నుంచి 2019 వరకు విప్‌గా పనిచేశారు. వేపాడ చిరంజీవి 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో గెలుపొందారు.
Similar News
News July 8, 2025
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ

విశాఖ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ మెమో ఉత్తరులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం మెమో పత్రాలను లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్, ఏపీయూడబ్ల్యూజే, జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ సంఘాల నాయకులకు డీఈవో ప్రేమ్ కుమార్ అందజేశారు. దీనిపై పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.
News July 8, 2025
కంచరపాలెం: ఈనెల 11న జాబ్ మేళా

కంచరపాలెం ITI జంక్షన్ వద్ద జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి అరుణ మంగళవారం తెలిపారు. 8 కంపెనీలు పాల్గొంటున్న మేళాలో టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. 18-45 ఏళ్లలోపు ఆసక్తి గల అభ్యర్థులు https://employement.ap.gov.in వెబ్ సైట్‌లో పేర్లు నమోదు చేసుకొని ధ్రువపత్రాలతో ఆరోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.
News July 8, 2025
పరీక్షల నిర్వహణ పటిష్టంగా ఉండాలి: ఏయూ వీసీ

విద్యలో నాణ్యతను పెంచే దిశగా అనుబంధ కళాశాలలు పనిచేయాలని ఏయూ వీసీ జిపి రాజశేఖర్ అన్నారు. సోమవారం ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. పరీక్షలు నిర్వహణ పటిష్టంగా జరపాలని, లేకపోతే ఏయూ అనుబంధ కళాశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొన్ని లోపాలు గుర్తించామని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.