News November 12, 2024

AP డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు

image

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా TDP ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరు ఖరారైంది. పలువురు నేతల పేర్లను పరిశీలించిన అనంతరం చివరకు RRR వైపే సీఎం చంద్రబాబు మొగ్గుచూపారు. మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే కూటమి MLAలు ఆయన్ను ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. తాజా ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి RRR MLAగా గెలిచారు.

Similar News

News November 1, 2025

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

image

సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్ శంషాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఫ్లైట్‌ను వెంటనే ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.

News November 1, 2025

టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలి: సంజయ్

image

TG: ఆరు రాష్ట్రాల్లో వేర్వేరుగా అమలవుతున్న టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కోరారు. HYDలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. AP, TG, కేరళ, WB, ఒడిశా, మణిపుర్‌లో పది, ఇంటర్‌లకు వేర్వేరు బోర్డులున్నాయని, వీటితో గందరగోళం ఏర్పడుతోందన్నారు. CBSE, ICSE బోర్డుల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు జాతీయ పరీక్షల్లో అర్హత సాధిస్తున్నారని గుర్తు చేశారు.

News November 1, 2025

కోళ్లలో రక్తపారుడు.. తీవ్రమైతే మరణం తప్పదు

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.