News November 13, 2024
BREAKING: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

TG: పెద్దపల్లి-రాఘవాపూర్ దగ్గర ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఓవర్ లోడ్ కారణంగా 6 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.
Similar News
News January 17, 2026
WPLలో నేడు రెండు మ్యాచ్‌లు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో నేడు ముంబై వేదికగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ముంబై, యూపీ మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత నాలుగు మ్యాచ్‌లలో యూపీ వారియర్స్ ఒకటి మాత్రమే గెలిచింది. మరోవైపు రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ, బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో టేబుల్ టాప్‌లో ఉన్న బెంగళూరు జోరుమీద ఉంది.
News January 17, 2026
పెరగనున్న టీవీ, ల్యాప్‌టాప్స్ ధరలు

వచ్చే 2 నెలల్లో టీవీలు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్ల ధరలు 4-8% పెరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. మెమరీ చిప్స్ ధరలు పెరగడమే ఇందుకు కారణం. చిప్స్ రేట్లు ఇప్పటికే 50% వరకు పెరగగా వచ్చే 2 నెలల్లో 40-50%, తర్వాత 3 నెలల్లో మరో 20% పెరిగే ఛాన్సుంది. దీంతో ఎలక్ట్రానిక్ డివైస్‌ల ధరలూ పెరగనున్నాయి. ఇప్పటికే గత 3 నెలల్లో ఫోన్ల ధరలు 3-21% పెరిగాయి. ఈ ఏడాది 30%+ పెరగొచ్చని నథింగ్ CEO అంచనా వేశారు.
News January 17, 2026
ఈ రైతు వ్యవసాయం ప్రత్యేకం.. రోజూ ఆదాయం

15 ఏళ్లుగా సమీకృత సేద్యం చేస్తూ అద్భుత విజయాలు అందుకుంటున్నారు జగిత్యాల(D)మెట్లచిట్టాపూర్‌కు చెందిన భూమేశ్వర్. 8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూ.. డెయిరీఫామ్, నాటు కోళ్లు, చేపలను కూడా పెంచుతున్నారు. పాలు, కూరగాయలు, ఆర్గానిక్ రైస్, కోళ్లు, చేపలు అమ్మి రోజూ ఆదాయం పొందుతున్నారు. ఈ రైతు సక్సెస్ స్టోరీ తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.


