News November 13, 2024

సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండండి: కడప ఎస్పీ

image

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు తెలిపారు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు సృష్టించే పోస్టులు ఎట్టిపరిస్థితుల్లో పెట్టకూడదని హెచ్చరించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగానూ.. పార్టీల మధ్య చిచ్చులు పెట్టేలాంటి పోస్టులకు దూరంగా ఉండాలని కోరారు. మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Similar News

News November 14, 2024

కడప: డిగ్రీ ఫలితాలు విడుదల

image

యోగివేమన విశ్వవిద్యాలయం డిగ్రీ సెమిస్టర్ 7, 8, LLB సెమిస్టర్‌ల పరీక్షా ఫలితాలను కులసచివులు ప్రొఫెసర్ పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు, సహాయ నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీనివాస రావుతో కలిసి విడుదల చేశారు. యోగివేమన విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్లో ఎల్.ఎల్.బి, డిగ్రీ పరీక్ష ఫలితాలను ఆమె విడుదల చేశారు.

News November 14, 2024

నందలూరు: వర్రా, సజ్జల భార్గవ్‌పై మరో కేసు

image

నందలూరు పోలీస్ స్టేషన్‌లో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, సిరిగిరి అర్జున్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ. ఐటీ చట్టాల కింద కేసు నమోదైంది. సోషల్ మీడియా వేదికగా నారా లోకేశ్, పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిద్దవటం మండలానికి చెందిన వాకమల్ల వెంకటాద్రి ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో వీరిపై 20 కేసులు నమోదయ్యాయి.

News November 14, 2024

కడప: వర్షంలోనూ సజావుగా ఆర్మీ ర్యాలీ

image

కడపలో ఆర్మీ రిక్యూట్‌మెంట్ ర్యాలీ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కడప జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగవరోజు ర్యాలీ జరుగుతున్న DSA మైదానం బురదగా మారింది. దీంతో రిమ్స్ హాస్పిటల్ రోడ్డులో రన్నింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.