News November 13, 2024
టూత్పేస్ట్పై ఈ కలర్ కోడ్స్ ఏంటి?
నిత్యం వినియోగించే టూత్ పేస్టుల్లో కలర్ కోడ్స్ ఉండటం గమనించారా? ఇవేమీ డిజైన్ కోసం వేసినవి కాదు. మొత్తం నాలుగు రంగుల స్ట్రిప్స్‌ను టూత్ పేస్ట్ కవర్‌పై చూడవచ్చు. ఇందులో బ్లూ రంగు న్యాచురల్ & మెడిసిన్స్‌తో కూడినదని సూచిస్తుంది. రెడ్ కలర్ న్యాచురల్ & కెమికల్స్ యాడ్ చేసినదని, గ్రీన్ కలర్ ఉంటే న్యాచురల్‌గా తయారుచేసిందన్నమాట. ఇక స్ట్రిప్‌పై బ్లాక్ కలర్ ఉంటే అది పూర్తిగా కెమికల్స్‌తో చేసిందని అర్థం.
Similar News
News November 14, 2024
మన దేశంలో ఇలాంటివి చూడగలమా?
అమెరికా ప్రస్తుత, కాబోయే అధ్యక్షులు జో బైడెన్, ట్రంప్ భేటీ కావడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. వారిద్దరూ ప్రపంచ రాజకీయాలు, అమెరికా పాలసీల గురించి చర్చించారు. అగ్రరాజ్యంలోని ఈ సంప్రదాయం బాగుందని, గత ప్రభుత్వ పాలసీలు కొత్త ప్రభుత్వానికి తెలుస్తాయని చెబుతున్నారు. ఇండియాలోనూ ఇలాంటి స్నేహపూర్వక రాజకీయాలు ఉండాలంటున్నారు. మరి మన దేశంలో అలాంటి ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఊహించడమైనా సాధ్యమేనా?
News November 14, 2024
దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యం ఎంతలా ఉందంటే?
కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఢిల్లీ విలవిలలాడుతోంది. ప్రస్తుతం వాయు నాణ్యత సూచిక (AQI) ప్రమాదకర స్థితిలో 432 వద్ద కొనసాగుతోంది. గాలిలో పొగ పెరగడంతో విజిబిలిటీ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో AQI ఎలా ఉందో తెలుసుకుందాం. చండీగఢ్‌లో 418, లక్నోలో 234, నోయిడాలో 367, గురుగ్రామ్‌లో 309, చురులో 290, కోల్‌కతాలో 162, హైదరాబాద్‌లో 96, చెన్నైలో 44, బెంగళూరులో 49, ముంబైలో 127గా ఉంది.
News November 14, 2024
‘దేవర’@50 డేస్.. ఎన్ని సెంటర్లలో అంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ 50 డేస్ పూర్తి చేసుకుంది. 52 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శితమైనట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదలైన సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.