News November 13, 2024

పశుగ్రాసాల సాగు చేయటానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం

image

ఆస్పరి: రైతులకు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా పశుగ్రాసాల సాగు చేయటానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని జేడి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం గ్రామ పశు వైద్య కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఎన్ఎల్ఎం ద్వారా గొర్రెల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. రైతులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 19, 2026

ఘనంగా గణతంత్ర వేడుకలు: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

News January 19, 2026

ఎమ్మిగనూరు: విషాదం.. తల్లీకూతురి మృతి

image

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట(M) జానంపేట సమీపంలోని NH-44పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరుకు చెందిన తల్లీకూతురు రాధ (42), లక్ష్మీదుర్గ (8) అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఆటో, బొలెరో వాహనాలు ఢీకొట్టి అనంతరం అవతలి రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News January 19, 2026

సైబర్ నేరగాళ్ల APK లింకులతో జాగ్రత్త

image

గుర్తుతెలియని వ్యక్తులు పంపే APK ఫైల్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని DIG, జిల్లా ఇన్‌ఛార్జి SP విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఇన్‌స్టాల్ చేస్తే వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు బ్యాంకింగ్ యాప్‌లు కూడా హ్యాక్ అయ్యే ప్రమాదముందని వివరించారు. ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే ఫ్లైట్ మోడ్‌లో పెట్టి సైబర్ ల్యాబ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.