News November 13, 2024
ఇవాళ ఇలా చేస్తే పెళ్లవుతుంది!
నేడు క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజు విష్ణువు 4 నెలల తర్వాత యోగ నిద్రలో నుంచి మేల్కొంటారు. ఉదయాన్నే తలంటు స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవాలని పురోహితులు చెబుతున్నారు. ఇవాళ ఇంట్లో తులసి మొక్కకు విష్ణుతో వివాహం జరిపిస్తారు. తులసి కళ్యాణం చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగి, ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని నమ్ముతారు. భార్యాభర్తల మధ్య విబేధాలు ఉంటే సమసిపోతాయని, పెళ్లికాని యువతులకు పెళ్లి జరుగుతుందని నమ్మకం.
Similar News
News November 14, 2024
దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యం ఎంతలా ఉందంటే?
కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఢిల్లీ విలవిలలాడుతోంది. ప్రస్తుతం వాయు నాణ్యత సూచిక (AQI) ప్రమాదకర స్థితిలో 432 వద్ద కొనసాగుతోంది. గాలిలో పొగ పెరగడంతో విజిబిలిటీ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో AQI ఎలా ఉందో తెలుసుకుందాం. చండీగఢ్‌లో 418, లక్నోలో 234, నోయిడాలో 367, గురుగ్రామ్‌లో 309, చురులో 290, కోల్‌కతాలో 162, హైదరాబాద్‌లో 96, చెన్నైలో 44, బెంగళూరులో 49, ముంబైలో 127గా ఉంది.
News November 14, 2024
‘దేవర’@50 డేస్.. ఎన్ని సెంటర్లలో అంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ 50 డేస్ పూర్తి చేసుకుంది. 52 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శితమైనట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదలైన సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
News November 14, 2024
కొత్త పెన్షన్లపై ప్రభుత్వం GOOD NEWS
AP: అర్హులైన పెన్షన్‌దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్‌దారులు గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని ఆదేశించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.