News November 13, 2024
విశాఖలో బంగారు రంగు పాము

నగరంలో యారాడ లైట్ హౌస్ ఇండియన్ నేవీ నివాసితులు ఉండే ప్రదేశంలో మంగళవారం సాయంత్రం పాము ప్రత్యక్షం అయ్యింది. విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన నేవీ అధికారి గ్యారేజీలో కారును పార్కింగ్ చేసేందుకు వెళ్లి చూడగా అక్కడ పాము మెరుస్తూ కనిపించిందని తెలిపారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని చాకచక్యంగా పామును పట్టుకున్నారు.
Similar News
News January 20, 2026
జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ 3.0 ప్రారంభం

జీవీఎంసీ మరో ముందడుగు వేసింది. ఆపరేషన్ లంగ్స్-3.0 పేరిట సెల్లార్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై కొరడా ఝులిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్డ్ మంగళవారం తెలిపారు. చాలా భవనాల్లో సెల్లార్లు వ్యాపార నిలయాలుగా మారడంతో రహదారులపై పార్కింగ్ సమస్య తలెత్తుతుందని, వెంటనే వీటిని ఆయా యజమానులు తొలగించాలన్నారు. లేదంటే జీవీఎంసీ తొలగిస్తుందని హెచ్చరించారు.
News January 20, 2026
విశాఖ కలెక్టర్‌కు అవార్డు

విశాఖపట్నం జిల్లా ఎన్నికల అధికారి ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఉత్తమ ఎన్నికల జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. 2025లో నిర్వహించిన ఎన్నికల్లో అత్యుత్తమ విధానాలను అమలు చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన పేరును నామినేట్ చేశారు. జనవరి 25న విజయవాడలో జరగనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
News January 20, 2026
జీవీఎంసీ అభివృద్ధి పనులు ఆదర్శనీయం: కేంద్ర బృందం

విశాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆదర్శనీయంగా ఉన్నాయని న్యూఢిల్లీ IIPA అర్బన్ స్టడీ బృందం ప్రశంసించింది. మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో భేటీ అయిన 9 మంది సభ్యుల బృందం నగరంలోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, పారిశుద్ధ్య నిర్వహణ తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకుంది. అనంతరం కాపులుప్పాడ, ముడసర్లోవ ప్లాంట్‌లను సందర్శించి నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.


