News November 13, 2024
ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు
భారత మాజీ క్రికెటర్ ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ తనను రూ.15కోట్ల మేర మోసం చేశారని JAN 5న రాంచీలో ధోనీ కంప్లైంట్ చేశారు. అయితే స్థానిక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాలు చేస్తూ దివాకర్, దాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు ఇచ్చింది.
Similar News
News November 14, 2024
CBSE విద్యార్థులకు అలర్ట్
వచ్చే ఏడాది 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో మార్పులు ఉంటాయని వస్తున్న వార్తల్ని CBSE కొట్టిపారేసింది. సిలబస్ 15% తగ్గింపు సహా కొన్ని సబ్జెక్టుల్లో ఓపెన్-బుక్ పరీక్షలను ప్రవేశపెట్టడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇండోర్‌లో జరిగిన ఓ సమావేశంలో సిలబస్ తగ్గిస్తున్నట్టు CBSE అధికారులు ప్రకటించారని వార్తలు వచ్చాయి. దీంతో బోర్డు ఈ వార్తల్ని ఖండించింది.
News November 14, 2024
OTTలోకి ‘కంగువా’ ఎప్పుడంటే?
సూర్య నటించిన ‘కంగువా’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. శివ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ రూ.100కోట్లకు దక్కించుకున్నట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కోలీవుడ్ సినిమాలు 4వారాలకే ఓటీటీలోకి వెళ్తుండగా, అందుకు భిన్నంగా ‘కంగువా’ 6వారాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలో ఇది ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది.
News November 14, 2024
మన దేశంలో ఇలాంటివి చూడగలమా?
అమెరికా ప్రస్తుత, కాబోయే అధ్యక్షులు జో బైడెన్, ట్రంప్ భేటీ కావడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. వారిద్దరూ ప్రపంచ రాజకీయాలు, అమెరికా పాలసీల గురించి చర్చించారు. అగ్రరాజ్యంలోని ఈ సంప్రదాయం బాగుందని, గత ప్రభుత్వ పాలసీలు కొత్త ప్రభుత్వానికి తెలుస్తాయని చెబుతున్నారు. ఇండియాలోనూ ఇలాంటి స్నేహపూర్వక రాజకీయాలు ఉండాలంటున్నారు. మరి మన దేశంలో అలాంటి ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఊహించడమైనా సాధ్యమేనా?