News November 13, 2024
IFS సాయి చైతన్య పట్ల గర్వంగా ఉంది: మహేశ్ భగవత్
TG: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్-2024 పరీక్షల్లో ఆలిండియా 131వ ర్యాంకు సాధించిన సాయి చైతన్య జాదవ్‌ను రాష్ట్ర అదనపు డీజీపీ మహేశ్ భగవత్ అభినందించారు. ‘సాయి చైతన్య పట్ల గర్వంగా ఉంది. 2022లో సివిల్స్ పరీక్షలకి, ఈ ఏడాది IFS ఇంటర్వ్యూకి అతడిని గైడ్ చేశాను. నేను ఆదిలాబాద్ SPగా ఉన్న సమయంలో సాయి తండ్రి గోవిందరావు నాతో కలిసి పనిచేశారు. ఆయన కుమారుడు ఇలా IFSకి సెలక్ట్ అవడం చాలా సంతోషం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 14, 2024
Delhi Pollution: ప్రైమరీ స్కూళ్లు బంద్
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయుల్ని తగ్గించేందుకు ఎయిర్ క్వాలిటీ కమిషన్ స్టేజ్-3 ప్రణాళికను శుక్రవారం నుంచి అమల్లోకి తేనుంది. దీని ప్రకారం ఎలక్ట్రిక్, CNG, BS-6 మినహా ఇంటర్ స్టేట్ బస్సులు తిరగడంపై నిషేధం. BS-3 పెట్రోల్, BS- 4 డీజిల్ ఫోర్ వీలర్స్‌పై నిషేధం. ప్రజా రవాణా వాడాలని అధికారులు ప్రజలకు సూచించారు. ప్రైమరీ స్కూళ్లను మూసివేసి Online Classes నిర్వహించాలని CM ఆతిశీ ఆదేశించారు.
News November 14, 2024
స్టార్ క్రికెటర్ల చిన్ననాటి ఫొటోలు
ఇవాళ చిల్డ్రన్స్ డే కావడంతో తమ అభిమాన హీరోలు, క్రికెటర్ల చిన్ననాటి ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. క్రికెటర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, సచిన్, ధోనీ, గిల్, యువరాజ్, పంత్, బుమ్రాల చైల్డ్‌హుడ్ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. నెలల బాబుగా ఉన్న రోహిత్ క్యూట్‌గా ఉన్నారని, మొదటిసారి ఈ ఫొటో చూస్తున్నామని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇందులో మీ అభిమాన క్రికెటర్ ఉన్నారా? కామెంట్ చేయండి.
News November 14, 2024
CBSE విద్యార్థులకు అలర్ట్
వచ్చే ఏడాది 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో మార్పులు ఉంటాయని వస్తున్న వార్తల్ని CBSE కొట్టిపారేసింది. సిలబస్ 15% తగ్గింపు సహా కొన్ని సబ్జెక్టుల్లో ఓపెన్-బుక్ పరీక్షలను ప్రవేశపెట్టడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇండోర్‌లో జరిగిన ఓ సమావేశంలో సిలబస్ తగ్గిస్తున్నట్టు CBSE అధికారులు ప్రకటించారని వార్తలు వచ్చాయి. దీంతో బోర్డు ఈ వార్తల్ని ఖండించింది.