News November 13, 2024
KCR పాలనలో అవినీతిపై విచారణ జరిపించాలి: TRS

మాజీ సీఎం KCR పాలనలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం CBIతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి(TRS) చీఫ్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. HYD బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్, కరెంట్ అగ్రిమెంట్, ల్యాండ్ ట్రాన్సఫర్మేషన్‌లో KCR రూ.వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. KCR అవినీతి తెలియజేసేందుకు DEC 6 నుంచి భద్రాచలం-చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు పాదయాత్ర చేస్తామన్నారు.
Similar News
News August 31, 2025
మెదక్: సెలవైనా.. అధికారులు విధుల్లో ఉండాల్సిందే: కలెక్టర్

భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సెలవు రోజు అయినా అధికారులు, సిబ్బంది విధుల్లో ఉండాలని సర్క్యులర్ జారీ చేశారు. సింగూరు నుంచి మంజీరా నదికి భారీగా నీరు విడుదల అవుతున్నందున, వరద పరిస్థితి, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
News August 31, 2025
MDK: ‘అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు’

రేగోడ్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్ శనివారం తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు ఎప్పటికప్పుడు సరిపడా లభించేలా, నిల్వలు సక్రమంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జావీద్, AEOలు మహేష్, భూలక్ష్మి పాల్గొన్నారు.
News August 30, 2025
మెదక్: రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్ మీటింగ్

మెదక్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాపై కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయితీలలో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వత తేదీ వరకు స్వీకరిస్తామన్నారు.