News November 13, 2024

చెన్నూర్: కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

image

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా శాలువాతో సత్కరించి పలు జాతీయ రహదారుల విషయంపై వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూరూ.100 రూ.100 జాతీయరహదారి- జాతీయ రహదారి- 63 విస్తరణ, కొత్త రోడ్డు నిర్మాణ పనులు మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 9, 2026

ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షకు.. 527 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 9,232 మంది విద్యార్థులకు గాను 8,705 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 399 మంది, ఒకేషనల్ విభాగంలో 128 మంది కలిపి మొత్తం 527 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News March 9, 2026

ఆదిలాబాద్: పలువురు తహశీల్దార్‌లకు స్థానచలనం

image

ముగ్గురు తహశీల్దార్లు, నలుగురు నాయబ్ తహశీల్దార్లకు స్థానచలనం కలిగింది. మండలాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. భీంపూర్ తహశీల్దార్ నలంద ప్రియను కలెక్టర్ కార్యాలయ హెచ్-విభాగం సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. ఉట్నూర్ తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ బేలకు స్థానచలనం కల్పించారు. కలెక్టర్ కార్యాలయం-హెచ్ సూపరింటెండెంట్ పంచపూలను డీ విభాగానికి వెళ్లారు.

News March 9, 2026

ఆదిలాబాద్: రేపే జాబ్ మేళ.. అన్ని ఏర్పాట్లు పూర్తి

image

ఆదిలాబాద్ పట్టణంలోని AR హెడ్ క్వాటర్స్‌లో మంగళవారం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సుమారు 50 వరకు కంపెనీలు ఇందులో పాల్గొని దాదాపు 2,000 మందిని భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.