News November 13, 2024

ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

image

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్‌మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.

Similar News

News March 18, 2026

ఉగాది ముహూర్తం.. సమయం ఇదే..

image

రేపటి నుంచి ‘పరాభవ’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉ.6 గం.53 ని.ల నుంచి ఉ.9.30 వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలని పేర్కొన్నారు.

News March 18, 2026

త్వరలో విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభం

image

AP: విశాఖ రైల్వే జోన్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. జనరల్ మేనేజర్ (GM) సహా ఇతర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియ పూర్తయ్యిందని పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జోన్ ప్రధాన కార్యాలయం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 57KM కొత్త రైల్వే లైన్ కోసం రూ. 2,047 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

News March 18, 2026

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం: సీఎం

image

TG: అసెంబ్లీకి రాని వారికి జీతాలు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై చర్చ జరగాలని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు కేసీఆర్ సభకు రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం తీసుకున్నారని తెలిపారు. ప్రజల సొమ్ము తీసుకుంటూ సభకు హాజరుకాకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. రైజింగ్ తెలంగాణ-2047 డాక్యుమెంట్‌ను కూడా ప్రతిపక్ష సభ్యులు చదవలేదని విమర్శించారు.