News November 13, 2024
‘విశాఖకు మెట్రో అవసరం ఉంది’

విశాఖ మెట్రోపై ఉమ్మడి జిల్లా MLAలు అసెంబ్లీలో మాట్లాడారు. విశాఖలో జనాభా పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని మెట్రో పూర్తయితేనే ఈ కష్టాలు తీరుతాయని గాజువాక MLA పల్లా పేర్కొన్నారు. అనకాపల్లి వరకు మెట్రో ప్లాన్ పొడిగించాల్సని అవసరం ఉందని MLA కొణతాల కోరారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తవుతున్న క్రమంలో ట్రాఫిక్ సమస్యలు పెరిగే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా మెట్రో పూర్తిచేయాలని MLA గణబాబు అన్నారు.
Similar News
News September 16, 2025
విశాఖ చేరుకున్న నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. రేపు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమలు కానుంది. దీంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమంతో పాటు స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్‌లో ఆమె పాల్గొంటారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.
News September 16, 2025
గోపాలపట్నంలో దారుణ హత్య

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 16, 2025
ప్రజలకు విశాఖ సిటీ పోలీసుల హెచ్చరిక

విశాఖపట్నం సిటీ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. లోన్ యాప్స్ వలలో పడి అనేక మంది వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. డౌన్లోడ్ చేసిన వెంటనే వ్యక్తిగత సమాచారం దోచుకుని, ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసాలకు గురవకుండా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.