News November 13, 2024
అణు రియాక్టర్లపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
థర్మల్ ప్లాంట్ల గడువు ముగిసినా, లేదా బొగ్గు సదుపాయం లేని రాష్ట్రాలు అణు విద్యుత్ ప్లాంట్లు ప్రారంభించాలని కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ సూచించారు. కరెంట్‌కు నానాటికీ డిమాండ్ పెరుగుతోందని తాజాగా జరిగిన విద్యుత్ మంత్రుల సదస్సులో గుర్తుచేశారు. దేశంలో 24 అణువిద్యుత్ ప్లాంట్స్ నుంచి 8 గిగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుండగా 2032 కల్లా దాన్ని 20 గి.వాట్లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది.
Similar News
News December 26, 2024
రూ.1,700 కోట్లు దాటిన ‘పుష్ప 2’ కలెక్షన్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.1,705 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 21 రోజుల్లోనే రూ.1705 కోట్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. హిందీలోనే ఈ చిత్రం 700 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఒక్క ముంబైలోనే రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు చేసింది.
News December 26, 2024
బాక్సింగ్ డే టెస్టుకు రికార్డ్ అటెండెన్స్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టుకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ పోరును ప్రత్యక్షంగా చూసేందుకు తొలి రోజు 87,242 మంది తరలివచ్చారు. భారత్, ఆసీస్ మధ్య జరిగిన టెస్టులో ఒక రోజు ఇంతమంది హాజరుకావడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 311/6 పరుగులు చేసింది.
News December 26, 2024
నిమిషానికి 158 బిర్యానీలు తినేశారు!
సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, పండుగొచ్చినా బిర్యానీలు తినాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. ఆర్డర్ చేస్తే ఇంటికే బిర్యానీ వస్తుండటంతో స్విగ్గీ బుకింగ్స్‌లో బిర్యానీ <<14970078>>టాప్‌లో<<>> నిలిచింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఏడాది నిమిషానికి ఏకంగా 158 బిర్యానీలు బుక్ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 150గా ఉండగా 2022లో 137, 2021లో 115, 2020లో నిమిషానికి 90 బిర్యానీల ఆర్డర్లు వచ్చేవి. ఏటా బుకింగ్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది.