News November 13, 2024
‘గడియారం’పై విచారణ.. సొంతకాళ్లపై నిలబడాలన్న సుప్రీంకోర్టు

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫొటోలు, వీడియోలు వాడరాదని అజిత్ పవార్ వర్గాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కార్యకర్తలకు ఈ విషయం తెలియజేయాలని పేర్కొంది. సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని జస్టిస్‌లు సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సూచించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ నేతృత్వంలోని NCP గడియారం గుర్తును వాడకుండా ఆదేశించాలన్న పిటిషన్‌ను కోర్టు విచారించింది. NOV 20 మహారాష్ట్రలో పోలింగ్ డే.
Similar News
News February 11, 2026
మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) భేటీలో నిర్ణయించారు. 17 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 15న శివరాత్రి, తర్వాతి రోజు 16న, మార్చి 1, 2, 3 తేదీల్లో సెలవులు ఉండనున్నాయి. 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చిస్తారు. అవసరమైతే సమావేశాలను పొడిగించాలని నిర్ణయించారు.
News February 11, 2026
నో ఎగ్జామ్.. టెన్త్ ఉత్తీర్ణతతో 28,740 ఉద్యోగాలు

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం ఉద్యోగాలకు దరఖాస్తు గడువు feb 14తో ముగియనుంది. 16 వరకు ఫీజు చెల్లించాలి. ఏపీలో 1,060, తెలంగాణలో 608 పోస్టులు ఖాళీ ఉన్నాయి. టెన్త్ ఉత్తీర్ణత కలిగి ఉండి 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. టెన్త్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. శాలరీ పోస్టును బట్టి రూ.10వేల నుంచి రూ.29,380గా ఉంది.
అప్లికేషన్ కోసం ఇక్కడ <
News February 11, 2026
దళిత యువతి వంట చేస్తోందని..

తరాలు మారుతున్నా కుల వివక్ష ఆగడం లేదు. ఒడిశాలోని కేంద్రపడాలో దళిత యువతి వంట చేస్తోందని అంగన్వాడీకి పిల్లలను పంపడం లేదు. శర్మిష్ఠ సేథి(23) ఇటీవల ఘడియామల్‌లోని అంగన్వాడీలో హెల్పర్-కుక్‌గా నియమితులయ్యారు. ఆమె వంట చేస్తోందని అంగన్వాడీకి ఎవరి పిల్లల్నీ పంపొద్దని విలేజ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో 3 నెలలుగా ఈ సెంటర్ మూతబడింది. విషయం బయటికి రావడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రకటించారు.


