News November 13, 2024
STOCK MARKETS: రూ.5లక్షల కోట్లు లాస్

స్టాక్ మార్కెట్లు విలవిల్లాడాయి. నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. FIIలు వెళ్లిపోవడం, రూపాయి బలహీనత, ఇన్‌ఫ్లేషన్ పెరుగుదల ఇన్వెస్టర్లలో నెగటివ్ సెంటిమెంటును పెంచాయి. సెన్సెక్స్ 77,690 (-984), నిఫ్టీ 23,559 (-324) వద్ద క్లోజయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.5లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. ఆటో, మెటల్, PSU బ్యాంకు, రియాల్టి సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. హీరోమోటో, హిందాల్కో, టాటా స్టీల్ టాప్‌లూజర్స్.
Similar News
News April 16, 2026
పెద్ది రిలీజ్ డేట్ అందుకే ప్రకటించలేదా?

రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ రిలీజ్‌ను సినిమా యూనిట్ జూన్‌కు వాయిదా వేసింది. కానీ డేట్‌ను మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే 2సార్లు పోస్ట్‌పోన్ అయిన నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని టాక్. జూన్ 4న యశ్ నటించిన ‘టాక్సిక్’ రిలీజ్ కానుంది. అది కూడా వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో క్లాష్ అవ్వకుండా ప్లాన్ చేయాలని పెద్ది యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
News April 16, 2026
ORR అలైన్‌మెంట్‌పై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

AP: అమరావతి ORR నిర్మాణానికి సంబంధించి విజయవాడ ఆగ్నేయ, ఈశాన్య పరిధిలోని అలైన్‌మెంట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన PILపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ORR నిర్మాణం ఎక్కడ జరగాలో పిటిషనర్ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. నిపుణుల బృందం ఖరారు చేసిన అలైన్‌మెంట్లలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.
News April 16, 2026
బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>


