News November 13, 2024

ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్: జగన్

image

AP:పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు బయటకొస్తాయనే భయంతోనే ఇన్ని నెలల పాటు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 4 నెలలు మాత్రమే ఉంటే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్‌లో ఆమేరకు నిధులు కేటాయించేవారు. ప్రజలను మోసం చేసేలా బడ్జెట్ ఉంది’ అని మండిపడ్డారు.

Similar News

News February 7, 2026

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ 40 పోస్టులకు నోటిఫికేషన్

image

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 40 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 10 వరకు పోస్ట్ చేయాలి. సంబంధిత విభాగంలో PhD/M.Phil, పీజీ, ME/MTech, NET/SET/SLET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://uohyd.ac.in

News February 7, 2026

సడన్‌గా తగ్గిన రష్యా చమురు దిగుమతులు!

image

2025లో భారత్‌కు రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్ ఇంపోర్ట్స్ ఒక్కసారిగా పడిపోయాయి. జూన్‌లో రోజుకు 20లక్షల బ్యారెళ్ల వద్ద టాప్ లెవల్‌కు చేరుకోగా.. నవంబర్ తర్వాత సీన్ రివర్స్ అయింది. US ఆంక్షలు, ట్రేడ్ రూల్స్ మారడంతో ఒక్కసారిగా దిగుమతులు పడిపోయాయి. ఒకప్పుడు 44% షేర్ ఉన్న రష్యా ఆయిల్ జనవరి నాటికి 22%కి పడిపోయింది. ప్రస్తుతం రోజుకు 11.6 లక్షల బ్యారెళ్లకు పరిమితమైనా ఇప్పటికీ రష్యా కీలక సప్లయర్‌గానే ఉంది.

News February 7, 2026

ఒక్క ప్రమాదం.. ముమైత్ జీవితం తలకిందులు!

image

ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్‌తో సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం తాను HYDలో మేకప్&హెయిర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు 30 ఏళ్లున్నప్పుడు ఇంట్లో జారిపడడంతో తలకు గాయమైంది. మెదడు నరాలు దెబ్బతిన్నాయి. 15రోజులు కోమాలో ఉన్నా. ఏడేళ్లు మంచానికే పరిమితమయ్యా. ఆ సమయంలో మా అమ్మే నన్ను చూసుకుంది’ అని తెలిపారు.