News November 13, 2024

రేపు అన్ని జిల్లాల్లో ఉద్యోగుల నిరసనలు

image

TG: వికారాబాద్(D) లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడికి నిరసనగా రేపు ఆందోళనలు చేయాలని ఉద్యోగుల ఐకాస నిర్ణయించింది. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట రేపు ఆందోళనలు చేపట్టాలని, లంచ్ టైమ్‌లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చింది. మరోవైపు లగచర్ల దాడి ఘటనను ఐఏఎస్ అధికారుల సంఘం సీరియస్‌గా తీసుకుంది. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Similar News

News November 5, 2025

ఉసిరి దీపాన్ని ఎలా తయారుచేసుకోవాలి?

image

కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపాన్ని వెలిగించడానికి గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగంలో గుండ్రంగా కట్ చేయాలి. ఆ భాగంలో స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి వేయాలి. ఆ నూనెలో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకం.

News November 5, 2025

ఉపరితల ఆవర్తనంతో ఈ జిల్లాల్లో వర్షాలు!

image

కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ APలోని కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, కడప, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలో ఇవాళ్టితో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వర్షాలు ముగుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

News November 5, 2025

నేడు తులసి పూజ ఎందుకు చేయాలి?

image

కార్తీక పౌర్ణమి రోజునే తులసీ మాత భూమిపైకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు తప్పకుండా తులసికి గంగాజలంతో పూజ చేయాలంటారు పండితులు. ఫలితంగా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. తులసి కోట వద్ద దీపారాధన చేసి, దీపదానం చేస్తే.. లక్ష్మీ దేవి సంతోషించి, కటాక్షాన్ని ప్రసాదిస్తుందట. అంతేకాక, పసుపు పూసిన నాణాన్ని ఎరుపు వస్త్రంలో ఉంచడం వలన కుటుంబంలో సంపదలు పెరిగి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.