News November 13, 2024
PHOTOS: పెర్త్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత జట్టు పెర్త్ మైదానంలో ప్రాక్టీస్ ఆరంభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ Xలో పోస్ట్ చేసింది. తొలి టెస్ట్ ఈనెల 22 నుంచి పెర్త్ వేదికగా జరగనుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. హిట్‌మ్యాన్ ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ బ్యాటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారని క్రీడా వర్గాలు తెలిపాయి.
Similar News
News January 22, 2026
IITRలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్(IITR) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ అర్హతతో పాటు LMV&HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు FEB 19 వరకు అప్లై చేసుకోవచ్చు. MTS పోస్టులకు గరిష్ఠ వయసు 25ఏళ్లు కాగా.. డ్రైవర్ పోస్టుకు 27ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: csiriitrprograms.in
News January 22, 2026
వసంత పంచమి ఎందుకు జరుపుకొంటారు?

జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీ దేవి మాఘ శుక్ల పంచమి నాడు జన్మించినట్లు పురాణాల వాక్కు. ఆ రోజునే వసంతి పంచమిగా జరుపుకొంటాం. బ్రహ్మదేవుడు సృష్టిలో భాగంగా లోకానికి వాక్కును, చైతన్యాన్ని ప్రసాదించడానికి అమ్మవారిని ఆవిర్భవించారు. అందుకే ఈ రోజును ‘శ్రీ పంచమి’, ‘వాగీశ్వరి జయంతి’గా కూడా పిలుస్తారు. వసంత కాలం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగులను నింపే పండుగ ఇది.
News January 22, 2026
ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు పెట్టరా?

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగి ఏడాదిన్నర కావొస్తోంది. చివరగా 2024 అక్టోబర్‌లో ఇక్కడ భారత్-బంగ్లాదేశ్ టీ20 జరిగింది. చివరి వన్డే 2023 WCలో, చివరి టెస్టు 2024 జనవరిలో జరిగాయి. అదే సమయంలో వైజాగ్ స్టేడియం మహిళల ప్రపంచకప్‌తో పాటు చాలా మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చింది. భారత్-న్యూజిలాండ్ చివరి టీ20 కూడా అక్కడే జరగనుంది. దీంతో హైదరాబాద్‌లో మ్యాచులు నిర్వహించాలని ప్రేక్షకులు కోరుతున్నారు.


