News November 13, 2024

రాజమహేంద్రవరం-అనకాపల్లి హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఎంపీ

image

రాజమహేంద్రవరం-అనకాపల్లి జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. జాతీయ రహదారి-16 పరిధిలోని అనకాపల్లి- అన్నవరం-దివాన్ చెరువు సెక్షన్లలోని నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరించడానికి డీపీఆర్‌లను కేంద్రం సంబంధిత కన్సల్టెంట్‌కు అందజేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 1, 2026

రూపాయికే ఎకరా.. చిన్న కంపెనీకి భారీ రాయితీనా: వైసీపీ

image

తర్లువాడలో సెమీకండక్టర్ యూనిట్‌కు ఎకరాకు రూపాయి చొప్పున 30 ఎకరాల భూమి కేటాయింపుపై YCP సందేహాలు వ్యక్తం చేసింది. ASIP టెక్నాలజీస్ లాంటి చిన్న ప్రైవేట్ సంస్థకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఇంత తక్కువ ధరకు ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది. ఈ నిర్ణయంపై ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని వైసీపీ నేత అమర్‌నాథ్ SMలో డిమాండ్ చేశారు. మంత్రి లోకేశ్, టీడీపీ స్పష్టత ఇవ్వాలన్నారు.

News March 1, 2026

విశాఖలో పెరుగుతున్న డ్రగ్స్ కేసులు.. యువతే లక్ష్యం

image

నగరంలో డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, గోవా నుంచి డ్రగ్స్, ఎండీఎంఏ, హ్యాష్ ఆయిల్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 22న పెందుర్తిలో 4 గ్రా. ఎండీఎంఏ స్వాధీనం కాగా, రెండు రోజుల క్రితం ఎంవీపీ పోలీసులు 2.23 గ్రా. యువకుడిని అరెస్ట్ చేశారు. గతేడాది నగర పరిధిలో గంజాయి, హ్యాష్ ఆయిల్ తదితరవి పట్టుబడగా వాటి విలువ రూ.5 కోట్లగా ఉంది. 500 పైగా కేసులు నమోదు అయ్యాయి.

News March 1, 2026

విశాఖలో కాయగూరల ధరలు ఇలా(కేజీల్లో)..

image

విశాఖలోని 15 రైతు బజార్లో కాయగూరలు ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. పూస వంకాయలు రూ.16, టమాటా రూ.10, కాకరకాయలు రూ.34, బెండకాయలు రూ.42, పచ్చిమిర్చి రూ.54, బీరకాయలు రూ.30, క్యాబేజీ రూ.14, క్యారెట్ రూ.22, దొండకాయలు రూ. 28, ఉల్లిపాయలు రూ.18, గోరుచిక్కుడు రూ.28, దోసకాయలు రూ.24, మునక్కాడ రూ.74, అల్లం రూ.66, చిక్కుడుకాయలు రూ.26, నిమ్మకాయలు రూ.65లకు విక్రయించాలని మార్కెటింగ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.