News November 13, 2024
HYD కమిషనరేట్ పరిధిలో సీఐలకు పోస్టింగ్
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెయిటింగ్‌లో ఉన్న 17 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్ ఇస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో 11 మందిని వివిధ స్టేషన్లలో డీఐలుగా నియమించగా, ముగ్గురిని సీసీఎస్‌లో, ముగ్గురికి ఎస్‌బీలో పోస్టింగ్ ఇచ్చారు. వీరంతా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
Similar News
News December 27, 2024
REWIND: హైదరాబాదీల మనసు గెలిచారు..
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. HYD విశ్వనగరంగా అభివృద్ధి చెందడంలో ఆయన సహకారం కీలకంగా ఉంది. కాగా.. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్, వెంకటాద్రి థియేటర్‌ల వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఆయన ఇక్కడ పర్యటించి ‘భయపడకండి’ అని బాధితులు, నగరవాసులకు ధైర్యం కల్పించారు. ఈ పర్యటనతో ఆయన హైదరాబాదీల మనసు గెలుచుకున్నారు.
News December 27, 2024
మహిళల రక్షణకు చట్టాల్లో మార్పులు వచ్చాయి: CI
ఆడపిల్లలు, చిన్నారులను గౌరవించకున్నా పర్వాలేదు కానీ అగౌరవపరిచి హింసకు గురిచేస్తే చట్ట ప్రకారం జైలుకెళ్లడం ఖాయమని HYDలోని శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈరోజు ఓ గార్డెన్‌లో మహిళల మానసిక హింస, పలు అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆడపిల్లలు నేటి సమాజంలో ధైర్యంగా ఉండాలంటే చదువుకోవాలని తద్వారా చట్టాల గురించి తెలుస్తుందన్నారు.
News December 26, 2024
జనవరి 3న బీసీ విద్యార్థులతో కలెక్టరేట్ల ముట్టడి: ఆర్.కృష్ణయ్య
16.75 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం బషీర్‌బాగ్‌లో వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజురీయంబర్స్‌మెంట్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడించనున్నట్లు తెలిపారు.