News November 13, 2024

చలికాలంలో పెదాలు పగలొద్దంటే..

image

* పెదాలు పగలడానికి డీహైడ్రేషన్ ప్రధాన కారణం. చలికాలం చాలామంది సరిపడా నీరు తాగరు. దీనివల్ల పెదాలు పొడిబారి, పగులుతాయి.
* పెదాలు కాస్త డ్రై అవగానే వాటిని నాలుకతో తడుపుతారు. ఇది పెదాలు మరింత పగలడానికి కారణం. పెదాలపై ఉండే స్కిన్‌ను కొరికేయవద్దు.
* విటమిన్ బీ, ఫ్యాటీ యాసిడ్లు, మినరల్స్ కలిగిన ఆహారం తీసుకోండి.
* బయటికి వెళ్లేటప్పుడు కచ్చితంగా మంచి లిప్‌బామ్/పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోండి.

Similar News

News November 10, 2025

ఏపీ టుడే

image

* ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. సీఐఐ సమ్మిట్, మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టాలపై అంచనాలు, పరిహారంపై చర్చకు అవకాశం. అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్.
* ఇవాళ, రేపు మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండుగా విడిపోయి పర్యటన. నేడు బాపట్లలో టీమ్-1, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరిలో టీమ్-2 పంట నష్టాలపై అంచనా వేయనున్నాయి.

News November 10, 2025

సఫారీలపై మన రికార్డు పేలవమే..

image

ఈ నెల 14 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గత రికార్డులు టీమ్ ఇండియాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు 16 సిరీస్‌లు జరగగా 8 సార్లు సఫారీలదే విజయం. ఇండియా 4 సార్లు గెలవగా, మరో నాలుగు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. చివరిగా ఆడిన సిరీస్ డ్రాగా ముగియడం భారత్‌కు ఊరటనిస్తోంది. కాగా WTC డిఫెండింగ్ ఛాంపియన్‌ను గిల్ సేన ఓడించాలంటే అన్ని విభాగాల్లోనూ రాణించాల్సిన అవసరం ఉంది.

News November 10, 2025

బహు భార్యత్వ నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం

image

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడుతామని CM హిమంత బిస్వ శర్మ తెలిపారు. దీనిని ఉల్లంఘించి రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు. ఎస్టీలకు తప్పా అందరికీ ఇది వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో 6వ షెడ్యూల్ వర్తించే ప్రాంతాలకు ప్రస్తుతం ఈ బిల్లు నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.