News November 14, 2024
పెంచలకోనలో వైభవంగా నరసింహుని ఉత్సవం

నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో బుధవారం ద్వాదశి సందర్భంగా శ్రీవార్లకు నందనవనంలో అష్టోత్తర శత కలశాభిషేకం, సాలగ్రామ దాత్రి పూజలు నిర్వహించి వనభోజనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారికి బంగారు గరుడ వాహనంపై వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా ఉత్సవం జరిపారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News July 7, 2025
PHOTO OF THE DAY..❤❤

అమ్మానాన్న లేరు. వీధివీధి తిరిగి భిక్షం ఎత్తుకోవడం, బస్టాండ్లలో నిద్రపోయే దీనపరిస్థితి ఆ ఇద్దరు చిన్నారులది. వాళ్లకూ ఓ మంచిరోజు వచ్చింది. ‘<<16930776>>సార్.. మేమూ చదువుకుంటాం<<>>’ అంటూ నెల్లూరు VRస్కూల్ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్‌ను వేడుకోవడంతో వారి జీవితం మారిపోయింది. వారం తిరగకముందే మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అదే స్కూల్లో అడ్మిషన్లు పొందారు. ఇప్పుడు ఆ ఇద్దరూ అందరిలా పాఠాలు నేర్చుకోనున్నారు.
News July 7, 2025
స్వర్ణాల చెరువుకు క్యూ కట్టిన భక్తులు

నెల్లూరులో రొట్టెల పండగ ఘనంగా జరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రెండో రోజు స్వర్ణాల ఘాట్ వద్ద భక్తుల సందడి నెలకొంది. పలువురు రొట్టెలను మార్చుకున్నారు. తర్వాత బారా షాహిద్ దర్గాలో ప్రార్థనలు చేశారు. రొట్టెల పండగలో ముఖ్యమైన గంధోత్సవం ఇవాళ రాత్రికి జరగనుంది. మీరూ రొట్టెల పండగకు వెళ్లారా? ఏ రొట్టె తీసుకున్నారు? ఏ రొట్టె ఇచ్చారు? కామెంట్ చేయండి.
News July 7, 2025
VR స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్

నెల్లూరులోని VR మున్సిపల్ స్కూల్‌ను విద్యాశాఖ మంత్రి లోకేశ్ సోమవారం ప్రారంభించారు. ఎంతో చరిత్ర గల ఈ పాఠశాలను ఇటీవల మంత్రి నారాయణ పున:నిర్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోకేశ్ పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. పలువురు విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. ఈ పాఠశాల పున:నిర్మాణంలో నారాయణ కూతురు షరిణి కీలక పాత్ర పోషించారు. మంత్రి వెంట ఎంపీ వేమిరెడ్డి, కలెక్టర్ ఆనంద్ తదితరులు ఉన్నారు.