News November 14, 2024

BGTలో మా బౌలర్లదే పైచేయి: హాడిన్

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ముందు భారత బ్యాటర్లు నిలవలేరని ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ అన్నారు. తొలి టెస్ట్ జరిగే పెర్త్‌లో ఓపెనింగ్ బ్యాటర్లకు చాలా కష్టంగా ఉంటుందని తెలిపారు. IND ఓపెనర్ జైస్వాల్ చాలా మంచి బ్యాటర్ అని, కానీ AUSలో ఆడిన అనుభవం లేదని పేర్కొన్నారు. బౌన్స్‌ను అతను ఎలా హ్యాండిల్ చేస్తారో ఇప్పుడే చెప్పలేమని ఓ పాడ్‌కాస్ట్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Similar News

News April 17, 2026

ఫ్రిజ్‌ను ఆఫ్ చేస్తున్నారా?

image

ఫ్రిజ్‌ను తరచూ ఆన్ ఆఫ్ చేస్తే కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజులు బయటికెళ్తున్నా, రిఫ్రిజరేటర్‌లో పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు ఉన్నా ఆఫ్ చేయొద్దని సూచిస్తున్నారు. వారాలపాటు మీరు ఇంట్లో లేకపోతే ఫ్రిజ్‌ను పూర్తిగా ఖాళీ చేసి ఆఫ్ చేయొచ్చని పేర్కొంటున్నారు. ట్రేలను శుభ్రం చేసి ఆరబెట్టాలని, లేదంటే ఫ్రిజ్ దుర్వాసన వస్తుందంటున్నారు.

News April 17, 2026

BJP రాజకీయంతోనే బిల్లు వీగింది: KTR

image

TG: డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయిందని కేటీఆర్ విమర్శించారు. BRS సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా.. BJP రాజకీయంతోనే బిల్లు వీగిందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోనే రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎటువంటి సమస్య వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా వెంటనే డీలిమిటేషన్ అంశంతో సంబంధం లేకుండా కొత్త బిల్లు తేవాలని డిమాండ్ చేశారు.

News April 17, 2026

కమిన్స్ ఎప్పటి నుంచి ఆడతారంటే?

image

IPL: SRH కెప్టెన్ పాట్ కమిన్స్ నేడు ఆ జట్టు క్యాంపులో చేరనున్నారని క్రీడావర్గాలు తెలిపాయి. అయితే రేపు చెన్నైతో జరిగే మ్యాచులో అతడు ఆడే అవకాశం లేదని పేర్కొన్నాయి. ఏప్రిల్ 25 నుంచి జరిగే మ్యాచులకు అందుబాటులో ఉండవచ్చని వెల్లడించాయి. కాగా కమిన్స్ రాకతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ దళం బలపడనుంది.