News November 14, 2024

అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న 3వ టీ20లో భారత క్రికెటర్ అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నారు. సిక్సు కొట్టి ఊపుమీదున్నట్లు కనిపించిన సఫారీ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ఆ తర్వాత బంతిని భారీ షాట్ కొట్టారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్ అందుకున్నారు. దీంతో మిల్లర్(18) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 15.5 ఓవర్లలో 142/5. భారత్ గెలుస్తుందా?

Similar News

News December 28, 2025

వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

image

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్‌లో మీ పూజను <>బుక్ చేసుకోండి<<>>.

News December 28, 2025

కొత్త ఆశలు, సంకల్పంతో నూతన ఏడాదిలోకి: మోదీ

image

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాతో ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచమే ఆశ్చర్యపోయిందని PM మోదీ అన్నారు. ‘ఏడాది చివర్లో అయోధ్య రామ మందిరంపై పతాకావిష్కరణతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోయింది. ఆపరేషన్ సిందూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారింది. స్వదేశీ ఉత్పత్తులపై ప్రజలు ఉత్సాహాన్ని కనబరిచారు. కొత్త ఆశలు, సంకల్పంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు దేశం సిద్ధం’ అని ‘మన్ కీ బాత్’లో చెప్పారు.

News December 28, 2025

69 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో <>ICDS <<>>69 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ పాసై, 21 నుంచి 35ఏళ్లు ఉన్న స్థానిక మహిళలు ఎల్లుండి(డిసెంబర్ 30) వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు జీతం నెలకు రూ.11,500, హెల్పర్‌కు రూ.7వేలు చెల్లిస్తారు. CDPOలు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావాల్సి ఉంటుంది. వెబ్‌సైట్: https://srisathyasai.ap.gov.in/