News November 14, 2024
తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై శ్రీలంక గెలుపు
డంబుల్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంక గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 324/5 స్కోర్ చేసింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 27 ఓవర్లకు కుదించి టార్గెట్‌ను 221 రన్స్ చేశారు. కాగా NZ 175/9 స్కోరుకే పరిమితమైంది. దీంతో DLS ప్రకారం 45 పరుగుల తేడాతో శ్రీలంక గెలిచింది. SL ఆటగాళ్లు మెండిస్(143), అవిష్క(100) సెంచరీలు చేశారు. నవంబర్ 17న తర్వాతి వన్డే జరగనుంది.
Similar News
News January 14, 2025
భారత్‌కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది అప్పుడే: మోహన్ భగవత్
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన జరిగిన రోజే భారత్‌కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అందుకే ఆ రోజును ‘ప్రతిష్ఠా ద్వాదశి’గా జరుపుకోవాలని చెప్పారు. రామ మందిర ఉద్యమం ఏ ఒక్కరినీ వ్యతిరేకించడానికి కాదని తెలిపారు. ఈ క్రమంలో భారత్ స్వతంత్రంగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబడుతుందని పేర్కొన్నారు. కాగా గత ఏడాది జనవరి 22న రామ విగ్రహ ప్రతిష్ఠ చేసిన సంగతి తెలిసిందే.
News January 14, 2025
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
TG: ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరిగే కాంగ్రెస్ జాతీయ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మరుసటి రోజు సింగపూర్ వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు అక్కడే పర్యటించనున్నారు. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్తారు. ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ రానున్నారు.
News January 14, 2025
కాంగ్రెస్ పాలనలోని తెలంగాణ పరిస్థితి ఇదే: కేటీఆర్
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని తెలంగాణ పరిస్థితి Kakistocracyగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పదానికి అర్థం పనికిరాని లేదా తక్కువ అర్హత కలిగిన చిత్తశుద్ధి లేని పౌరుల చేతిలో పాలన ఉండటం. బీఆర్ఎస్ నేతల వరుస అరెస్టులను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.