News November 14, 2024

సూర్య ‘కంగువా’ పబ్లిక్ టాక్

image

సూర్య మూవీ ‘కంగువా’కు మిక్సుడ్ టాక్ వస్తోంది. పీరియాడిక్ ఇంట్రడక్షన్ సీక్వెన్సులు బాగున్నాయంటున్నారు. అయితే ఒకానొక సమయం తర్వాత హీరో-విలన్ల మధ్య బిల్డప్ చిరాకు తెప్పిస్తుందట. సూర్య ఇంటెన్స్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టారంటున్నారు. ఫస్టాఫ్ యావరేజ్‌, సెకండాఫ్ డిసప్పాయింట్ చేసిందని కొందరంటున్నారు.

Similar News

News January 17, 2026

NLG: మేయర్ పీఠం సహా 9 పురపాలికలు మహిళలకే

image

ఉమ్మడి జిల్లాలో మేయర్ పీఠంతో పాటు 9 పురపాలికల ఛైర్‌పర్సన్ స్థానాలు మహిళలకే దక్కాయి. ఎస్సీలకు రెండు, బీసీలకు 3, జనరల్ 7, జనరల్ మహిళలకు 7 స్థానాలకు రిజర్వు చేశారు. బీసీలకు రిజర్వు చేసిన మూడింటిలో ఒక్కటి మాత్రమే జనరల్ కాగా రెండు మున్సిపాలిటీలు మహిళలకే రిజర్వు చేయడం విశేషం.

News January 17, 2026

పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు.. నేటి నుంచే అమల్లోకి

image

TG: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని CM రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన <<18836703>>విషయం<<>> తెలిసిందే. ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆర్థిక సాయం భార్య పేరున జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దివ్యాంగ దంపతులకు వివాహానంతరం ఎదురయ్యే ఆర్థిక ఒత్తిళ్లు తగ్గడంతోపాటు, నివాసం, వైద్య ఖర్చులు, జీవనోపాధికి సహాయ పడుతుందని పేర్కొంది.

News January 17, 2026

19న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన) ఏప్రిల్ కోటాను ఈనెల 19న TTD విడుదల చేయ‌నుంది. ఈ-డిప్ కోసం 21వ తేదీ 10AM వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 23న 12PM లోపు డబ్బు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవ టికెట్లు(కళ్యాణోత్సవం), 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టికెట్లు విడుదల కానున్నాయి.