News November 14, 2024

ఒంగోలులో DLDO సస్పెండ్

image

ప్రకాశం జిల్లాలో ఓ కీలక అధికారిణి సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం ఒంగోలు డీఎల్డీవోగా ఉన్న ఉషారాణి గతంలో డీపీవోగా పనిచేశారు. ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఇందులో ఆమె అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా ఆమెను ప్రభుత్వానికి సరెండ్ చేయగా.. తాజాగా ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

Similar News

News November 23, 2024

పెద్దారవీడు మండలంలో వివాదాస్పద ఘటన

image

పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. పశువులను మేతకోసం తీసుకువచ్చిన సందర్భంలో.. అటవీశాఖ అధికారులు తమపై దాడి చేశారని పశువుల కాపర్లు ఆరోపించారు. పశువుల కాపరి వెంకటేశ్వర్లును అటవీశాఖ అధికారులు కొట్టడంతో గాయాలయ్యాయని మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అయితే అటవీశాఖ అధికారులు తమపైనే పశువుల కాపర్లు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 23, 2024

ఎందుకు నన్ను చూస్తే భయమేస్తోంది: తాటిపర్తి

image

కూటమి ప్రభుత్వం ఆర్థిక దోపిడీ చేయడానికి PAC ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వలేదని యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ‘పీయూసీ కమిటీ మెంబర్‌గా నామినేషన్ వేసిన నేనంటే చంద్రబాబు కుమారుడికి ఎందుకంత భయం? ఎందుకు ఇన్నిన్ని కేసులు పెడుతున్నారు? దళితులకు ఇచ్చే ప్రాధాన్యం ఇదేనా? మాదిగ జాతి బిడ్డలను ఇలా హింసించడం దారుణం. చంద్రబాబును దెబ్బకు దెబ్బ తీస్తాం’ అని ఎమ్మెల్యే హెచ్చరించారు.

News November 22, 2024

ఒంగోలు: ఇతను విమానాల్లో తిరిగే దొంగ

image

మధ్యాహ్న సమయంలో మాత్రమే దొంగతనాలు చేసే వ్యక్తి తిరుపతి పోలీసులకు చిక్కాడు. ప్రకాశం(D) సింగరాయకొండ(M) సోమరాజుపల్లికి చెందిన గురువిళ్ల అప్పలనాయుడు(29), చెడు అలవాట్లకు బానిసై 16వ ఏట నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. విమానాల్లో తిరుగుతూ.. ఎంజాయ్ చేస్తుంటాడు. తిరుపతిలోని ఓ ఫైనాన్స్ ఆఫీసులో ఈనెల 15న రూ.8 లక్షలు దొంగలించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరాయకొండ, ఒంగోలు, విశాఖలో ఇతనిపై 18 కేసులు ఉన్నాయి.