News November 14, 2024

రైతులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

image

TG: DAP ధర బస్తాపై ఏకంగా ₹300 పెరగడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50KGల DAP ధర ఇటీవల వరకు ₹1350 ఉండగా, తాజాగా ₹1650కు పెంచారు. పాత స్టాక్‌కు కొత్త ధర వర్తించదని ప్రభుత్వం చెబుతున్నా వ్యాపారులు ₹1650 వసూలు చేస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు. OCT నుంచి యాసంగి సీజన్ ప్రారంభం కాగా, ఇదే అదనుగా భావించి పలువురు వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరకు అమ్ముతున్నట్లు ఆరోపణలున్నాయి.

Similar News

News September 13, 2025

సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యం: CM చంద్రబాబు

image

AP: 15% వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పౌరసేవలతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని, దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో 3% వృద్ధి తగ్గడంతో రాష్ట్రం సుమారుగా రూ.6 లక్షల కోట్ల సంపదను కోల్పోయిందన్నారు.

News September 13, 2025

కృష్ణా జలాల వాటాలో చుక్కనీటిని వదలొద్దు: రేవంత్

image

కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని సీఎం రేవంత్ న్యాయ నిపుణులను, ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. నికర, మిగులు, వరద జలాల్లో చుక్క నీటిని వదులుకునేది లేదని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఆధారాలను సిద్ధం చేసి అందించాలని అధికారులు, న్యాయనిపుణులను ఆదేశించారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీలో జరిగే ట్రిబ్యునల్ విచారణలో ఈ అంశాలను గట్టిగా వినిపించాలని సూచించారు.

News September 13, 2025

ఆంధ్ర క్రికెట్ హెడ్ కోచ్‌గా గ్యారీ స్టీడ్

image

ఆంధ్ర మెన్స్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్‌ను ACA నియమించింది. ఈ నెల 20-25 తేదీల మధ్య ఆయన బాధ్యతలు చేపడతారని సమాచారం. కాగా గ్యారీ ఆధ్వర్యంలో కివీస్ 2019 WC ఫైనల్ చేరుకుంది. అలాగే 2021 WTC టైటిల్ సాధించింది. మరోవైపు ఆంధ్ర గత రంజీ సీజన్‌లో గ్రూప్-Bలో ఆరో స్థానంలో నిలిచింది. VHTలో గ్రూప్-Bలో నాలుగు, SMATలో ప్రీక్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లింది.