News November 14, 2024
సచివాలయ ఉద్యోగులకు అలర్ట్

AP: రాష్ట్ర సచివాలయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ విధానం నవంబర్ 1నుంచి 30వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని, తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు.
Similar News
News April 18, 2026
ప్రతిపక్షాలపై PM మోదీ ఆగ్రహం

కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్ కామెంట్స్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని మండిపడ్డారు. తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు మహిళా బిల్లును అడ్డుకోవడం ఘోర పాపమని, పైగా సంబరాలు చేసుకోవడం ఏంటని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు.
News April 18, 2026
పిల్లలతో నయన్, విఘ్నేశ్ క్యూట్ పిక్స్

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమ కవల పిల్లలతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ ఖాళీ సమయంలో ఉయిర్, ఉలగ్‌లతో ఈ జంట సరదాగా గడిపారు. తమ చిన్నారుల అల్లరికి సంబంధించిన చిత్రాలను షేర్ చేయగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు. సెలబ్రిటీ పేరెంట్స్‌గా వారు పంచుకున్న ఈ మధుర క్షణాలు ట్రెండింగ్‌లో నిలిచాయి.
News April 18, 2026
అప్పుల్లో గేల్.. తానే సాయం చేశానన్న లలిత్ మోదీ

2011 ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిన గేల్‌ను జట్టులోకి తీసుకొమ్మని RCBకి చెప్పింది తానేనని IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వెల్లడించారు. ‘వేలంలో గేల్ అమ్ముడుపోలేదు. ఎన్ని ఫ్రాంచైజీలను సంప్రదించినా నో అన్నారని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పులున్నాయి.. ఎలాగైనా ఆడాలని అన్నాడు. ఇంజూరీ ప్లేయర్ స్థానంలో తీసుకొమ్మని విజయ్ మాల్యాను రిక్వెస్ట్ చేశా’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2011లో గేల్ 608 రన్స్ చేశారు.


