News November 14, 2024
పిల్లల్ని కోటీశ్వరులను చేసే స్కీమ్.. Children’s day గిఫ్ట్‌గా ఇవ్వండి

తల్లిదండ్రులు ఆస్తులు కూడబెట్టేది పిల్లల కోసమే! అందుకే వాళ్ల రిటైర్మెంటు కార్పస్నూ పేరెంట్సే క్రియేట్ చేసేందుకు తీసుకొచ్చిన స్కీమే <<14158275>>NPS వాత్సల్య<<>>. పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణ పెంచేందుకూ ఇది ఉపయోగపడుతుంది. PFRDA వద్ద ఖాతా ఆరంభించి నెలకు కనీసం రూ.1000 జమ చేయాలి. పిల్లలకు 18ఏళ్లు నిండాక రెగ్యులర్ NPSగా మారుతుంది. అప్పట్నుంచి 60 ఏళ్ల వరకు వాళ్లే జమచేయాలి. RoR 12.86% ఉంటే రూ.12 కోట్లు అందుతాయి.
Similar News
News November 14, 2025
రెండో రౌండ్లోనూ సేమ్ సీన్

జూబ్లీహిల్స్ బైపోల్ రెండో రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులోనూ నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లో నవీన్‌కు 9,691, మాగంటి సునీతకు 8,690 ఓట్లు పోలయ్యాయి. రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్థి 1,144 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్లో వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
News November 14, 2025
14,967 పోస్టులకు నోటిఫికేషన్

KVS, NVSలో 14,967 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. నేటి నుంచి DEC 4వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: kvsangathan.nic.in/మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 14, 2025
13 వస్తువులతో త్వరలోనే బేబీ కిట్లు!

AP: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు త్వరలోనే ఎన్టీఆర్ బేబీ కిట్లు అందనున్నాయి. జోన్ల వారీగా వేర్వేరు సంస్థలకు కిట్ల సరఫరా బాధ్యతలు అప్పగించనున్నారు. టెండరులో 4 బిడ్లు రాగా మూడింటిని ఖరారు చేసినట్లు సమాచారం. సంవత్సరానికి 3.50 లక్షల మందికి ఈ కిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కిట్‌లో బ్యాగు, దోమతెర, ఫోల్డబుల్ బెడ్ సహా మొత్తం 13 రకాల వస్తువులు ఉండనున్నాయి.


