News November 14, 2024

క్రేజీ మ్యాచ్.. 19 ఏళ్ల తర్వాత బాక్సింగ్ రింగులోకి టైసన్

image

లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్(58) దాదాపు 19 ఏళ్ల తర్వాత రింగులోకి అడుగుపెట్టనున్నారు. ప్రముఖ యూట్యూబర్ జేక్ పాల్(27)తో రేపు తలపడనున్నారు. డల్లాస్‌లో జరిగే ఈ మ్యాచ్‌ను నెట్‌ప్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. బాక్సింగ్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన టైసన్ 2005లో చివరి మ్యాచ్ ఆడారు. 1985లో కెరీర్ ఆరంభించిన ఆయన వరుసగా 37 మ్యాచ్‌లను గెలిచారు. మొత్తంగా 50-6తో కెరీర్ ముగించారు.

Similar News

News April 18, 2026

మహిళా రిజర్వేషన్లు.. సామాన్యులకు టికెట్ సాధ్యమా?

image

పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఒకవేళ చట్టం అమల్లోకి వచ్చినా దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందేది ఇప్పుడున్న రాజకీయ నేతల కుటుంబసభ్యులు, బంధువులేనని పలువురు పెదవి విరుస్తున్నారు. వారి భార్యకో, కూతురికో, కోడలికే టికెట్ వస్తుందని, సాధారణ మహిళలకు టికెట్ దక్కడం చాలా కష్టమంటున్నారు. మీ COMMENT?

News April 18, 2026

సినిమా కథ రాసుకున్న రామ్.. డైరెక్టర్ కోసం వేట?

image

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత కొత్త ప్రాజెక్టు విషయంలో రామ్ పోతినేని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ మూవీలో పాట రాసిన ఆయన ఈసారి ఓ కథను తన కోసం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆ స్టోరీని ఫర్‌ఫెక్ట్‌గా తెరపై ఆవిష్కరించే డైరెక్టర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. గతంలో లోగి విఘ్నేశ్‌తో ఓ సినిమా దాదాపు ఖాయమవగా అనివార్య కారణాలతో ఆగిపోయినట్లు టాలీవుడ్ టాక్. మరి రామ్ చెప్పిన కథను తీసే దర్శకుడెవరో?

News April 18, 2026

రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

image

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.