News November 14, 2024
పిల్లల్ని కంటాం గానీ పెంచడమెలా CBN సర్!
ఎక్కువ మందిని కనమంటున్న AP CM చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. జపాన్ తరహాలో మానవ వనరుల సంక్షోభం రావొద్దన్న ఆయన ఉద్దేశంలో అర్థం ఉందంటున్నారు. ఎక్కువ మందిని కనడం OKగానీ వాళ్లను పెంచి పెద్దచేయడం, చదువు చెప్పించడం ఎలాగని ప్రశ్నిస్తున్నారు. లక్షల్లో స్కూలు ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు, తక్కువ జీతాలతో ఎలా సాకగలమని అంటున్నారు. ప్రత్యేకంగా స్కీములు ప్రకటిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు.
Similar News
News November 15, 2024
పాకిస్థాన్‌కు చేరిన ఛాంపియన్స్ ‘ట్రోఫీ’
ఓవైపు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ చుట్టూ అనిశ్చితి నెలకొని ఉండగా మరోవైపు ICC మాత్రం మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్త ప్రదర్శన నిమిత్తం ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌కు పంపింది. ప్రపంచంలోనే రెండో ఎత్తైన పర్వతం K2 శిఖరానికి కూడా ఈ ట్రోఫీని తీసుకెళ్లనున్నారు. కాగా ఈ టోర్నీ కోసం పాక్‌కు వెళ్లేందుకు ఇండియా No చెప్పడంతో దీని నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
News November 15, 2024
కపిల్‌శర్మ షో నుంచి అందుకే బయటికొచ్చా: సిద్ధూ
కపిల్‌శర్మ షో నుంచి నిష్క్రమించడంపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎట్టకేలకు మౌనం వీడారు. రాజకీయాల వల్లే తాను షో నుంచి వైదొలగాల్సి వచ్చిందన్నారు. అంతకంటే ఎక్కువ వివరించకూడదని చెప్పారు. 2019లో ఈ షో నుంచి సిద్ధూ నిష్క్రమించడం అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే పుల్వామా దాడి గురించి ఆయన ‘ఉగ్రవాదులకు మతాలు లేవు’ అని చేసిన వ్యాఖ్యల వల్లే షో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది.
News November 15, 2024
నవంబర్ 15: చరిత్రలో ఈ రోజు
* 1949: నాథూరామ్ గాడ్సే మరణం.
* 1982: భారత స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే మరణం.
* 1986: భారతదేశ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం.
* 2000: బీహార్ నుంచి ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.
* 2022: నటుడు ఘట్టమనేని కృష్ణ మరణం(ఫొటోలో).