News November 14, 2024
KTRను జైలుకు పంపాలి: అర్వింద్

TG: లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో KTR హస్తం ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. గతంలో తనపై జరిగిన దాడిలో కూడా KTR పాత్ర ఉందన్నారు. ‘BRSను నామరూపాలు లేకుండా చేయాలి. KTRను జైలుకు పంపాలి. మళ్లీ బయటకు రాకూడదు. ఇంకా అహంకారంగానే, కొవ్వు పట్టినట్లే ఆయన మాట్లాడుతున్నారు. లగచర్ల ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News November 2, 2025
కార్తీక పౌర్ణమి ఏరోజు జరపాలంటే?

ఈ ఏడాది కార్తీక పౌర్ణమి NOV 5న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. నదీ స్నానాలకు 4:52 AM – 5:44 AM అనుకూలంగా ఉందన్నారు. పూజా కార్యక్రమాలను 7:58 AM – 9:00 AM జరపాలని సూచించారు. దీపారాధనకు సా.5:15 గంటల నుంచి రా.7:05 వరకు ఉత్తమమన్నారు. పౌర్ణమి రోజున 365 వత్తుల దీపం పెట్టి, శివకేశవులను పూజించి, ఉపవాసం ఉంటే.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం.☞ కార్తీక పౌర్ణమి విశేషాలు, పూజ నియమాల కోసం <<-se_10013>>భక్తి<<>>.
News November 2, 2025
అవార్డును అభిమానులకు అంకితమిస్తున్నా: అల్లు అర్జున్

పుష్ప సినిమాలో నటనకు గాను ప్రతిష్ఠాత్మక అవార్డుకు అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ‘మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఆయన ఎంపికైనట్లు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్-2025 ప్రకటించింది. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ తన అభిమానులకు అవార్డును అంకితం ఇస్తున్నానని ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నిరంతర ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.
News November 2, 2025
BREAKING: సుందర్ విధ్వంసం.. భారత్ విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సూర్య సేన 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో సుందర్ (23 బంతుల్లో 49*), జితేశ్ శర్మ (13 బంతుల్లో 22*) మెరుపులతో భారత్‌కు విజయాన్ని అందించారు. అంతకుముందు టిమ్ డేవిడ్, స్టాయినిస్ రాణించడంతో ఆస్ట్రేలియా 186 రన్స్ చేసింది. దీంతో 5 టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.


