News November 14, 2024
కడప దర్గాను దర్శించుకోనున్న రామ్ చరణ్

సినీ నటుడు రామ్ చరణ్ కడప అమీన్ దర్గాను ఈ నెల 18న దర్శించుకోనున్నారు. అక్కడ జరిగే 80వ దర్గా నేషనల్ ఘజల్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కాగా.. శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ‘ఉప్పెన’ బుచ్చిబాబు డైరెక్షన్లో కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు.
Similar News
News December 5, 2025
‘పుష్ప-2’కు ఏడాది.. అల్లుఅర్జున్ స్పెషల్ ట్వీట్

‘పుష్ప2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ తమకు మరింత ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని అద్భుతంగా మార్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కెప్టెన్’ సుకుమార్ సహా చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. ‘పుష్ప’గా ఈ 5ఐదేళ్ల ప్రయాణం తన జీవితంలో మరువలేనిదని కొనియాడారు.
News December 5, 2025
ఏపీలో తొలి సోలార్ వేఫర్ యూనిట్: నారా లోకేశ్

AP: దేశంలోనే తొలి సోలార్ ఇంగోట్ వేఫర్ తయారీ యూనిట్ ఏపీలో ఏర్పాటవుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. అనకాపల్లిలో ReNewCorp రూ.3,990 కోట్ల పెట్టుబడితో 6GW సామర్థ్యంతో ఈ యూనిట్‌ను స్థాపించనున్నట్లు ‘X’ వేదికగా వెల్లడించారు. CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో కుదిరిన MoU ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని పేర్కొన్నారు.
News December 5, 2025
డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో హెడ్ SeMT, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/B.Tech/BCA/BSc(IT)/BSc(CS), M.Tech/MS/MBA/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ora.digitalindiacorporation.in


