News November 14, 2024
ఎన్నికల సమయం: ‘దురుసు’ రాజకీయం

ఎన్నికల వేళ నేతల దురుసు వ్యాఖ్యల చుట్టూ రాజకీయం నడుస్తోంది. MHలో శివసేన నాయకురాలు శైనాను ఉద్ధవ్ పార్టీ నేత అర్వింద్ సావంత్ ‘దిగుమతి సరుకు’ అని విమర్శించడం దుమారం రేపింది. కుమార స్వామిపై మంత్రి అజ్మీర్ ‘కాలియా’ అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. UP CM యోగి వస్త్రధారణపై ఖర్గే వ్యాఖ్యలు, BJPని కుక్కలా మార్చాలని నానా పటోలే అనడం వివాదం రేపింది. ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలే రాజకీయాన్ని నడుపుతున్నాయి.
Similar News
News March 11, 2026
BREAKING: IPL తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది

ఐపీఎల్-2026 తొలి దశ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే 20 మ్యాచుల తేదీలు, వేదికలను ఐపీఎల్ ప్రకటించింది. షెడ్యూల్ కోసం పైన ఇమేజ్‌లు చూడండి. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచులు ఆడనుంది. మూడు రాష్ట్రాల ఎన్నికల డేట్లు ప్రకటించిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను వెలువరిస్తామని BCCI తెలిపింది.
News March 11, 2026
BREAKING: IPL తొలి మ్యాచ్ ఎవరి మధ్య అంటే?

క్రికెట్ అభిమానులకు శుభవార్త. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నెల 28న తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో రా.7.30 గంటలకు జరిగే ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ తలపడనున్నట్లు IPL ట్వీట్ చేసింది. మరికాసేపట్లో తొలి దశ షెడ్యూల్ రానుంది.
News March 11, 2026
అంతరిక్షంలో అంతా నిశ్శబ్దమే

అంతరిక్షం ఒక నిశ్శబ్ద సామ్రాజ్యం. భూమిపై గాలి ఉండటం వల్ల శబ్ద తరంగాలు ప్రయాణిస్తాయి. కానీ అంతరిక్షంలో గాలి, నీరు వంటి మాధ్యమాలు లేకపోవడంతో అక్కడ పెద్ద పేలుడు జరిగినా అది మనకు అస్సలు వినిపించదు. అక్కడ భారీ గ్రహశకలాలు ఢీకొన్నా, నక్షత్రాలు పేలిపోయినా ఎటువంటి శబ్దమూ రాదు. వ్యోమగాములు పక్కపక్కనే ఉన్నా రేడియో తరంగాలు లేకుండా మాట్లాడుకోలేరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..


