News November 14, 2024
Stock Market: వరుసగా ఆరోసారి నష్టాలు
స్టాక్ మార్కెట్లు గురువారం తేరుకుంటున్నట్టు కనిపించినా ఉదయం 11 తరువాత Sharp Fall రావడంతో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టంతో 77,580 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు నష్టంతో 23,532 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా వరుసగా ఆరో సెషన్‌లోనూ మార్కెట్లు నష్టాల్లో నిలిచాయి. అయితే, సెన్సెక్స్‌కు 77,400 వద్ద, నిఫ్టీకి 23,500 పరిధిలో కీలక మద్దతు లభించడంతో సూచీలు Sideways వెళ్లాయి.
Similar News
News November 15, 2024
ఇంగ్లండ్ టార్గెట్ 146 రన్స్
ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 రన్స్ మాత్రమే చేసింది. కెప్టెన్ పావెల్(54), రొమారియో షెఫర్డ్(30) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, ఓవర్టన్ 3, ఆర్చర్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే 146 రన్స్ చేయాలి.
News November 15, 2024
మహిళా మంత్రిని భయపెడుతున్న అరటిపండ్లు!
స్విడన్‌లో జెండర్ ఈక్వాలిటీ మినిస్టర్ పౌలినా బ్రాండ్‌బర్గ్ అరటి పండ్లను చూస్తే ఆమడదూరం పరిగెత్తుతున్నారు. ఆమెకు బనాన ఫోబియా ఉంది. అందుకే తాను ఎక్కడ పర్యటనకు వెళ్లినా ముందే అక్కడి అధికారులతో ‘బనానా ఫ్రీ’ జోన్‌లను ఏర్పాటు చేయమని మెయిల్స్ చేస్తున్నారు. ఫోబియా నుంచి బయటపడేందుకు ఆమె చికిత్స పొందుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఈ ఫోబియా ఉన్నవారికి అరటి పండ్లను చూస్తే వికారం, ఆందోళన కలుగుతుంది.
News November 15, 2024
BRS, BJP ఒక్కటే అన్నవాడిని చెప్పుతో కొట్టాలి: KTR
TG: BRS, BJP ఒక్కటే అన్నవాడిని చెప్పుతో కొట్టాలని KTR ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆ ప్రచారంలో నిజం ఉంటే MLC కవిత ఎందుకు 5నెలలు జైలులో ఉంటారని ప్రశ్నించారు. BRS, BJP ఒక్కటయితే కలిసి ఉంటే ‘అమృత్ స్కామ్’పై తాము ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. మంత్రి పొంగులేటి మీద ED రైడ్స్ జరిగితే వివరాలు ఎందుకు బయటికి రావడం లేదని అన్నారు.