News November 14, 2024
హైవేపై టైర్ పంక్చర్.. పల్టీ కొట్టిన బొలెరో వాహనం
కంచికచర్ల మండల పరిధిలోని కీసర జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి నందిగామ వైపు వెళుతున్న బొలెరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. బొలెరో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, అతణ్ని ప్రభుత్వ ఆస్పత్రి తరలించి చికిత్స అందించారు. బండిలోని సరుకు రోడ్డుపై పడటంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Similar News
News November 15, 2024
మచిలీపట్నం: సాగర హారతితో ప్రారంభం కానున్న సముద్ర స్నానాలు
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సాగర హారతితో సముద్ర స్నానాలు శుక్రవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ఉదయం 5గంటలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రుడికి హారతులు ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభిస్తారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
News November 14, 2024
విజయవాడ: నెహ్రూకి నివాళులర్పించిన వైఎస్ షర్మిల
భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశానికి విశేష సేవలు అందించారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశం కోసం నిస్వార్ధంగా సేవలు అందించిన ఏకైక కుటుంబం గాంధీ కుటుంబం అని అన్నారు.
News November 14, 2024
కృష్ణా: విద్యార్థులకు అలెర్ట్.. అకడమిక్ క్యాలెండర్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLB & BA.LLB కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ప్రతీ సెమిస్టర్‌లో 90 పని దినాలు, ప్రణాళికాబద్ధంగా పరీక్షలు జరిగేలా క్యాలెండర్‌ను రూపొందించామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు.