News November 14, 2024

నర్సంపేట: పారా మెడికల్ కోర్సుల ప్రవేశానికి గడువు పెంపు

image

నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తు గడువును పెంచినట్లు ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. నవంబర్ 11న దరఖాస్తు చివర తేదీ కాగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20 వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత, దరఖాస్తు విధానం తదితర వివరాలకు ఆన్లైన్‌లో చూసుకోవాలని తెలిపారు.

Similar News

News July 9, 2025

వరంగల్: రేపు ప్రభుత్వ పాలిటెక్నీక్ కాలేజీలో నేషనల్ వర్క షాప్

image

వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నక్ కాలేజీలో గురువారం భారత ప్రభుత్వ విజ్ఞాన, సాంకేతిక శాఖ(DST), తెలంగాణ రాష్ట్ర విజ్ఞాన సాంకేతిక మండలి ఆధ్వర్యంలో వన్ డే వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకుల మేధో సంపత్తి హక్కుల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ప్రభాకర్ తెలిపారు.

News July 8, 2025

WGL: నేడు 118 విద్యాలయాల్లో ‘స్ఫూర్తి’

image

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో స్ఫూర్తి
కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 118 విద్యాలయాల్లో బ్యాంకర్లు, జర్నలిస్టులు, సీనియర్ సిటిజన్లు సమాజంలో జరుగుతున్న సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.

News July 8, 2025

వరంగల్ జిల్లాలో 37.6 శాతం వర్షాపాతం నమోదు

image

జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో వర్షపాతం మోస్తరుగా నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 37.6 శాతం నమోదైంది. గీసుకొండ, దుగ్గొండి, నల్లబెల్లి, ఖిలా వరంగల్, మండలాల్లో మోస్తరు వర్షం కురవగా పర్వతగిరిలో వర్షం కురువలేదని తెలిపారు. వర్ధన్నపేట, రాయపర్తి, ఖానాపూర్, చెన్నారావుపేట, ఖానాపూర్, నర్సంపేట, మండలాల్లో తక్కువ వర్షాపాతం నమోదైంది.