News November 14, 2024
స్టార్ క్రికెటర్ల చిన్ననాటి ఫొటోలు

ఇవాళ చిల్డ్రన్స్ డే కావడంతో తమ అభిమాన హీరోలు, క్రికెటర్ల చిన్ననాటి ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. క్రికెటర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, సచిన్, ధోనీ, గిల్, యువరాజ్, పంత్, బుమ్రాల చైల్డ్‌హుడ్ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. నెలల బాబుగా ఉన్న రోహిత్ క్యూట్‌గా ఉన్నారని, మొదటిసారి ఈ ఫొటో చూస్తున్నామని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇందులో మీ అభిమాన క్రికెటర్ ఉన్నారా? కామెంట్ చేయండి.
Similar News
News January 23, 2026
‘MSVPG’కి పెంచిన టికెట్ ధరల లెక్కలు ఇవ్వండి: HC

TG: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి వాస్తవ లెక్కలను సమర్పించాలని GST అధికారులను హైకోర్టు ఆదేశించింది. చట్టవిరుద్ధంగా టికెట్ ధరలను పెంచారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. రూ.45 కోట్లు అక్రమంగా సంపాదించారని, వాటిని రికవరీ చేయాలని పిటిషనర్ శ్రీనివాస రెడ్డి కోరారు. కోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.
News January 23, 2026
కేటీఆర్ విచారణ @6 గంటలు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ సుమారు 6 గంటలుగా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో ఏం జరగనుందో అని పీఎస్ బయట BRS శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. పోలీసులకు వ్యతిరేకంగా మహిళా కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
News January 23, 2026
RCBని కొనుగోలు చేయనున్న అనుష్క?

RCB ఫ్రాంచైజీలో వాటా దక్కించుకోవడానికి విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఆమె బిడ్ వేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. రూ.400 కోట్లు వెచ్చించి 3% వాటా కొనాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం కోహ్లీ RCB తరఫున ఆడుతున్నారు. అటు ఈ ఫ్రాంచైజీ కోసం బిడ్ వేస్తానని అదర్ పూనావాలా <<18930355>>ఇప్పటికే<<>> ప్రకటించారు.


