News November 14, 2024
Delhi Pollution: ప్రైమరీ స్కూళ్లు బంద్
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయుల్ని తగ్గించేందుకు ఎయిర్ క్వాలిటీ కమిషన్ స్టేజ్-3 ప్రణాళికను శుక్రవారం నుంచి అమల్లోకి తేనుంది. దీని ప్రకారం ఎలక్ట్రిక్, CNG, BS-6 మినహా ఇంటర్ స్టేట్ బస్సులు తిరగడంపై నిషేధం. BS-3 పెట్రోల్, BS- 4 డీజిల్ ఫోర్ వీలర్స్‌పై నిషేధం. ప్రజా రవాణా వాడాలని అధికారులు ప్రజలకు సూచించారు. ప్రైమరీ స్కూళ్లను మూసివేసి Online Classes నిర్వహించాలని CM ఆతిశీ ఆదేశించారు.
Similar News
News November 15, 2024
RTC బస్సుల్లో వృద్ధులకు 25% రాయితీ
బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ ఇవ్వనున్నట్లు APSRTC ప్రకటించింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ RTC బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలుంటుంది. సీనియర్ సిటిజన్లకు 60ఏళ్ల వయసు పైబడి ఉండాలి. ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ ఐడీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, రేషన్ కార్డుల్లో ఏదైనా చూపించాల్సి ఉంటుంది. అది ఫిజికల్ లేదా డిజిటల్ రూపంలోనైనా చూపించవచ్చని APSRTC తెలిపింది.
News November 15, 2024
BJPలో ఉన్నందుకే బతికిపోయా: MLA విష్ణుకుమార్
AP: గత వైసీపీ ప్రభుత్వం విమర్శించిన వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టిందని విశాఖ BJP MLA విష్ణుకుమార్ రాజు అన్నారు. ఎన్నికల సమయంలో ఓ MLAపై విమర్శలు చేసినందుకు తనపైనా కేసులు పెట్టారని, అయితే తాను BJPలో ఉండటం వల్ల తప్పించుకోగలిగానని అన్నారు. లేకపోతే రఘురామకృష్ణరాజుకు ఇచ్చిన ట్రీట్మెంటే తనకూ తప్పేది కాదన్నారు.
News November 15, 2024
INDvsSA: సాధిస్తారా? సమం చేస్తారా?
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య చివరిదైన 4వ టీ20 జరగనుంది. ఈరోజు రాత్రి 8.30గంటలకు జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. జరిగిన 3 టీ20ల్లో 2 గెలిచిన భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఆతిథ్య సఫారీ జట్టేమో ఇందులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది.
> ALL THE BEST INDIA