News November 14, 2024

పాలనకు ఏడాది.. విజయోత్సవాలపై సీఎం సమీక్ష

image

TG: వచ్చే నెలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో విజయోత్సవాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నేతలకు సూచించారు. ముఖ్యంగా మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించాలని చెప్పారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ సభల్లో సీఎం పాల్గొనే అవకాశం ఉంది.

Similar News

News November 15, 2024

టాలీవుడ్‌లోకి స్టార్ డైరెక్టర్ కూతురు.. ఫస్ట్ లుక్ చూశారా?

image

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. <<14591707>>’భైరవం’ సినిమాలో<<>> వెన్నెల అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకుడు. ఇందులో సాయి శ్రీనివాస్‌కు ఆమె జంటగా నటిస్తున్నట్లు సమాచారం.

News November 15, 2024

బ్రష్ చేసిన వెంటనే టీ/కాఫీ తాగుతున్నారా?

image

ఉదయం బ్రష్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం ప్రమాదకరమని డెంటిస్టులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల దంతాల ఎనామెల్‌ను దెబ్బతింటుందట. బ్రష్ చేయడం వల్ల దంతాలపై బ్యాక్టీరియా తొలగిపోయి సెన్సిటివ్‌గా మారతాయి. దంతాలపై ఉన్న ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం ఉంటుందట. అందుకే బ్రష్ చేసిన 30ని.షాల తర్వాత టీ లేదా కాఫీ తీసుకోవడం ఉత్తమం అంటున్నారు.

News November 15, 2024

ఈ ప్రాంతాల్లో వర్షాలు

image

AP: ఈరోజు కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అటు అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్సుందని HYD IMD పేర్కొంది.