News November 14, 2024

ఎడమ కంటికి సమస్య.. కుడి కంటికి ఆపరేషన్ చేశారు

image

UP గ్రేటర్ నోయిడాకు చెందిన నితిన్ భాటి తన కొడుకుకు ఎడమ కంట్లో నుంచి తరచూ నీరు కారుతోందని ఆనంద్ స్పెక్ట్రమ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు బాలుడి కంట్లో ఫారెన్ బాడీ(మెటల్ వంటి ధూళి) ఉన్నట్లు గుర్తించి, ఆపరేషన్ చేశారు. అయినా సమస్య తీరకపోవడంతో మరో ఆసుపత్రిని సంప్రదించారు. అయితే బాలుడి ఎడమ కంటికి కాకుండా కుడి కంటికి ఆపరేషన్ చేశారని తేలింది. ఘటనపై బాలుడి తండ్రి PSలో ఫిర్యాదు చేశారు.

Similar News

News November 15, 2024

టీ20 సిరీస్ ఇంగ్లండ్ కైవసం

image

మూడో టీ20లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 145/8 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 3 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా 5 మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది.

News November 15, 2024

కులగణనతో ఏ పథకం రద్దు కాదు: సీఎం రేవంత్

image

TG: కులగణన వల్ల ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగిపోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ సర్వే ఒక మెగా హెల్త్ చెకప్ లాంటిదని చెప్పారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా కులగణన జరగాలని అన్నారు. కొంత మంది దీనిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

News November 15, 2024

RTC బస్సుల్లో వృద్ధులకు 25% రాయితీ

image

బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ ఇవ్వనున్నట్లు APSRTC ప్రకటించింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ RTC బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలుంటుంది. సీనియర్ సిటిజన్లకు 60ఏళ్ల వయసు పైబడి ఉండాలి. ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ ఐడీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, రేషన్ కార్డుల్లో ఏదైనా చూపించాల్సి ఉంటుంది. అది ఫిజికల్ లేదా డిజిటల్ రూపంలోనైనా చూపించవచ్చని APSRTC తెలిపింది.