News November 15, 2024

KTR అరెస్టులో కాంగ్రెస్ ఎందుకు తగ్గుతోంది?: కొండా

image

TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఇలా అధికారులపై దాడులకు దిగడం దారుణమని ఆయన మండిపడ్డారు. మరోవైపు KTR అరెస్టు విషయంలో కాంగ్రెస్ ఎందుకు వెనక్కి తగ్గుతోందని విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

Similar News

News April 20, 2026

జూన్/జులైలో MPTC, ZPTC ఎన్నికలు?

image

TG: MPTC, ZPTC ఎన్నికలను జూన్ చివరి వారం లేదా జులైలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. గతంలో మే నెలలోనే జరపాలని అనుకున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం జనాభా గణన చేపట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 11 నుంచి జూన్ 9 వరకు జనాభా గణన ప్రక్రియ కొనసాగనుంది. ఈలోగా ఓటర్ల జాబితా సవరణ కూడా పూర్తి చేయాల్సి ఉండటంతో యంత్రాంగం బిజీగా ఉంది.

News April 20, 2026

ఆల్కహాల్ అలవాటు లేకపోయినా లివర్ సమస్యలు.. ఎలా?

image

ఆల్కహాల్ అలవాటులేని వారికి లివర్ ప్రాబ్లమ్స్ రావనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య సిటీల్లో చాలామంది ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్’ (NAFLD) బారిన పడుతున్నారు. గంటల తరబడి కూర్చొని ఉండటం, లేట్ నైట్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోతోంది. బరువు తక్కువగా ఉన్నా ఈ సమస్య రావొచ్చు. దీన్ని ‘లీన్ ఫ్యాటీ లివర్’ అంటారు. వాకింగ్, మంచి ఆహారంతో ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

News April 20, 2026

ఇండియా ఆఫర్‌ను తిరస్కరించా: రషీద్ ఖాన్

image

భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సిటిజన్‌షిప్ ఆఫర్లను తాను తిరస్కరించానని రషీద్ ఖాన్ తెలిపారు. ఈ 2 దేశాల తరపున ఆడే అవకాశం వచ్చినా సున్నితంగా వద్దని చెప్పినట్లు తన కొత్త పుస్తకంలో వెల్లడించారు. ‘నేను నా దేశం కోసం తప్ప, వేరే ఏ దేశం కోసం ఆడను’ అని చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 2023 IPL సమయంలో ఇండియన్ క్రికెట్ బోర్డ్ అధికారి ఒకరు సిటిజన్‌షిప్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పారు.