News November 15, 2024
సర్ఫరాజ్ ఖాన్‌కు గాయం?

టీమ్ ఇండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ గాయపడ్డట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్‌లో ఆయన మోచేతికి గాయమైనట్లు సమాచారం. వెంటనే ఆయన నొప్పితో మైదానం వీడినట్లు తెలుస్తోంది. గాయం తీవ్రతపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై జట్టు మేనేజ్‌మెంట్ స్పందించాల్సి ఉంది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జట్టు కూర్పుపై కూడా ప్రభావం చూపిస్తుంది.
Similar News
News July 4, 2025
AI ద్వారా భూ సమస్యల పరిష్కారం: మంత్రి అనగాని

AP: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూములను ఆధార్, సర్వే నంబర్లతో లింక్ చేస్తామని చెప్పారు. ‘రైతులకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నాం. గ్రీవెన్స్ ద్వారా ఇప్పటివరకు 4.63 లక్షల ఫిర్యాదులు రాగా 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించాం. త్వరలోనే మిగతా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
News July 4, 2025
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. sensex 193 పాయింట్ల లాభంతో 83,432 వద్ద స్థిరపడింది. nifty 55 పాయింట్లు లాభపడి 25,461 వద్ద ట్రేడింగ్ ముగించింది. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ, విప్రో, అల్ట్రాటెక్, రిలయన్స్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్ M&M షేర్లు నష్టపోయాయి.
News July 4, 2025
మథుర ‘షాహీ దర్గా’ పిటిషన్ కొట్టివేత!

శ్రీ కృష్ణ జన్మభూమి వివాదం మరో మలుపు తిరిగింది. మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయంలోని షాహీ దర్గాని వివాదాస్పద కట్టడంగా ప్రకటించాలని హిందూ సంఘాలు దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. దీనిపై ముస్లిం సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ధర్మాసనం ఈ విధంగా తీర్పునిచ్చింది. కృష్ణ జన్మభూమిపై హిందూ సంఘాలు దాఖలు చేసిన ఇతర పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.