News November 15, 2024

రంగులు మారే శివలింగం ఎక్కడుందంటే?

image

తమిళనాడు రాష్ట్రం అతిపురాతన ఆలయాలకు నిలయం. ఇక్కడ సైన్స్‌కు చిక్కని ఎన్నో రహస్యాలు, సంపదలున్న ఆలయాలున్నాయి. ఇందులో తిరునళ్లూరులో ఉండే శ్రీ పంచ వర్ణేశ్వరాలయం ఒకటి. ఇక్కడున్న శివలింగం ఒక్క రోజులోనే 5 రకాల రంగుల్లో మారుతుంటుంది. లింగాన్ని రాగి, పింక్, గోల్డెన్, ఆకుపచ్చ, అనౌన్ కలర్‌లో చూడొచ్చు. చోళరాజులు నిర్మించిన ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తే కైలాసగిరి ప్రదక్షిణం చేసినట్లేనట.

Similar News

News November 15, 2024

కడప పెద్దదర్గా ఉత్సవాలకు సర్వం సిద్ధం

image

AP: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలకు నేడు శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు గంధం, ఎల్లుండి ఉరుసు, 18న ముషాయిరా ఉంటాయని చెప్పారు. 20వ తేదీన రాత్రి ఊరేగింపు ఉంటుందన్నారు. ఇందుకోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఈ ఉత్సవాలకు రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

News November 15, 2024

నెలకు రూ.5వేలు.. నేడే లాస్ట్ డేట్

image

కేంద్రం అమలు చేస్తున్న ‘పీఎం ఇంటర్న్ షిప్’ పథకానికి దరఖాస్తు గడువు నేటితో (నవంబర్ 15) ముగియనుంది. దీని ద్వారా ప్రభుత్వం టాప్-500 కంపెనీల్లో యువతకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తుంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివి, 21-24 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులు. ఎంపికైన వారికి ప్రభుత్వం నెలకు రూ.5వేలు స్టైఫండ్ ఇస్తుంది. https://pminternship.mca.gov.in సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.

News November 15, 2024

కానిస్టేబుల్ రాతపరీక్ష ‘కీ’పై హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: గత ఏడాది జనవరి 22న నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’కి సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు APSLPRBని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఏడు ప్రశ్నలకు ‘కీ’లో ఇచ్చిన సమాధానాలు సరైనవి కావని, దీనివల్ల తాము అనర్హులయ్యామంటూ పలువురు పిటిషన్ దాఖలు చేశారు. కాగా 6,100 కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలో 95,208 మంది అర్హత సాధించారు.